By: ABP Desam | Updated at : 22 May 2023 10:50 AM (IST)
ICICI బ్యాంక్ వడ్డీ రేట్లు మారాయ్
ICICI Bank FD Interest Rate: రెండు కోట్ల రూపాయలకు పైబడి చేసే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ICICI బ్యాంక్ సవరించింది. రూ. 2 కోట్లకు పైబడిన బల్క్ ఎఫ్‌డీ డిపాజిట్ల రేటు రూ. 2 కోట్ల స్థాయికి తగ్గించింది. దీంతో, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాల పరిమితి ఉన్న పెద్ద స్థాయి ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 4.75% నుంచి 6.75% వరకు వడ్డీ రేటు ఇస్తుంది. గత శనివారం నుంచి (20 మే 2023) నుంచి కొత్త ఎఫ్‌డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.
ICICI బ్యాంక్ బల్క్ FD రేట్లు
7 రోజుల నుంచి 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75% వడ్డీ రేటును ICICI బ్యాంక్ అందిస్తోంది.
30 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితి ఉన్న డిపాజిట్ల మీద 5.50% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
46 రోజుల నుంచి 60 రోజుల కాల పరిమితి ఉన్న డిపాజిట్ల కోసం 5.75% వడ్డీ రేటును బ్యాంక్ ప్రకటించింది.
61 రోజుల నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు 6.00% వడ్డీ రేటును అందిస్తోంది.
91 రోజుల నుంచి 184 రోజుల కాల పరిమితి గల డిపాజిట్ల మీద 6.50% వడ్డీ రేటును చెల్లిస్తుంది.
185 రోజుల నుంచి 270 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.65% వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది.
271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాల గడువుతో జమ చేసిన బల్క్ FD మీద 6.75% వడ్డీ రేటును ఐసీఐసీఐ బ్యాంక్ చెల్లిస్తుంది.
1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు కాల పరిమితి ఉన్న డిపాజిట్ల కోసం బ్యాంక్ 7.25% వడ్డీ రేటును ఇస్తోంది.
15 నెలల నుంచి 2 ఏళ్ల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7% వడ్డీ రేటును చెల్లిస్తోంది.
10 ఏళ్ల కాలంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 6.75% వడ్డీని ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తోంది.
Q4లో ఐసీఐసీఐ బ్యాంక్ లాభం
2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో, ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 27.64% పెరిగి, రూ. 9,852.70 కోట్లకు చేరుకుంది. స్వతంత్ర నికర లాభం దాదాపు 30% వార్షిక పెరుగుదలతో రూ. 9,121.87 కోట్లుగా నమోదైంది. జనవరి-మార్చి కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 36,108.88 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (NII) 40.2% YoY జంప్‌తో రూ. 17,667 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 4.90%కు పెరిగింది. ICICI బ్యాంక్ ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ స్థూల NPA 2.81%కి పడిపోయింది. డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 10.9% వృద్ధితో రూ. 11,80,841 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి గాను, షేర్‌హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ. 8 తుది డివిడెండ్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: గోల్డ్ షాపులు కిటకిట - ₹2000 నోట్లు తీసుకోవడానికి 'వన్ కండిషన్'
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Latest Gold-Silver Price Today 30 May 2023: కొండ దిగుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Investment Scheme: మీ డబ్బుల్ని వేగంగా డబుల్ చేసే మంచి పోస్టాఫీసు స్కీమ్
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి
Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?