By: ABP Desam | Updated at : 26 Feb 2022 07:20 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price Today: హైదరాబాద్‌లో ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరు(Petrol Price in Hyderabad (26th February 2022)కు రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది. 19 పైసలు పెరగడంతో ఇక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.107.96 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.39 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 19 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 అయింది. 18 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.31 కి దిగొచ్చింది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. 18 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.108.57 కు చేరింది. 16 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.94.95 అయింది. నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లోపెట్రోల్ పై రూ.0.56 పైసలు తగ్గి లీటర్ ధర రూ.109.53 కాగా, డీజిల్‌పై రూ.0.53 పైసలు తగ్గి లీటర్ ధర రూ.95.85 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 26th February 2022)పై 33 పైసలు పెరగడంతో నేడు లీటర్ ధర రూ.110.98 కాగా, ఇక్కడ డీజిల్ పై 31 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.97 అయింది. విశాఖపట్నంలోపెట్రోల్ లీటర్ ధర రూ.109.05 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.95.18 వద్ద నిలకడగా ఉంది.
చిత్తూరు జిల్లాలో ధరలు..
చిత్తూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ లీటర్ ధర ప్రస్తుతం రూ.110.54 కాగా, డీజిల్ ధర రూ.96.56 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Jeep Meridian: ఫార్ట్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Buying Gold: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా? మొదట ఇన్కం టాక్స్ రూల్స్ తెలుసుకోండి
Business Idea: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?