By: ABP Desam | Updated at : 23 Jan 2022 07:50 AM (IST)
petrol
Petrol-Diesel Price 23 January 2022: గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 22 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.34 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.91 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.34గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి, నేడు లీటర్ ధర రూ.108.25 అయింది. 30 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.65 వద్ద నిలకడగా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ పై రూ.0.34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.109.93 అయింది. డీజిల్ ధర రూ.0.31 పైసలు తగ్గడంతో రూ.96.23 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 10 పైసలు పెరిగి లీటర్ ధర రూ.110.61 అయింది. ఇక్కడ డీజిల్ పై 9 పెరగడంతో లీటర్ ధర రూ.96.68 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 4 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్ పై 4 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.51 కు చేరింది.
చిత్తూరు జిల్లాలో ధరలు..
చిత్తూరులోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. లీటరుపై 87 పైసలు పెరగడంతో పెట్రోలు ధర ప్రస్తుతం రూ.111.31 కి చేరింది. ఇక డీజిల్ ధర రూ.0.80 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.97.27 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సరం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Richest South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!
Penalty on TCS: వారం రోజుల్లో టీసీఎస్‌కు రెండో భారీ షాక్, Q3 లాభాలు అమెరికాపాలు!?
Latest Gold-Silver Prices Today 28 November 2023: పట్టుకోలేనంత ఎత్తులో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Car Prices To Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే తీసుకోండి, అతి త్వరలో రేట్లు పెరుగుతాయ్
Share Market Opening Today 28 November 2023: ఆరంభ శూరత్వం, ఆ వెంటనే నీరసం - ఈ రోజు మార్కెట్ల తీరిది
Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల
Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
/body>