By: ABP Desam | Updated at : 18 Mar 2022 07:45 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price Today 18th March 2022: హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ (Petrol Price Today 18th March 2022) రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లకు దిగొచ్చింది. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) పెరిగింది. వరంగల్‌లో 46 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌పై 43 పైసలు దిగిరావడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది.
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.31 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నేడు నిలకడగా ఉన్నాయి. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.107.38 కాగా, 14 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.78 గా ఉంది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 65 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.110.41 కాగా, డీజిల్‌పై 61 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.68కి చేరింది.
మహబూబ్ నగర్‌లో 80 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.109.17కు దిగిరాగా, 75 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.95.53 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 18th March 2022)పై 56 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.91 కాగా, ఇక్కడ డీజిల్ పై 52 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.96 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు తగ్గాయి. 50 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.40 అయింది. డీజిల్‌పై 46 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51గా ఉంది.
చిత్తూరులో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. పెట్రోల్ పై 72 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.46కి పతనమైంది. డీజిల్ పై 64 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.52 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?
Kotak Mutual Fund: రూ.10 వేల సిప్ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Cryptocurrency Prices Today: రోజురోజుకీ పతనమవుతున్న బిట్‌కాయిన్, ఎథీరియమ్!
Infosys CEO Salary: ఆ సీఈవో వేతనం రూ.42.50 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పెంపు!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!