By: ABP Desam | Updated at : 28 Jul 2022 07:58 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.52 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు గత వారం రోజులుగా స్థిరంగా ఉన్నాయి. నేడు (జులై 28) పెట్రోల్ ధర రూ.109.16 గా ఉంది. డీజిల్ ధర రూ.97.35గా నిలకడగా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.0.73 పైసలు తగ్గి రూ.111.11 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.69 పైసలు పెరిగి నేడు రూ.99.16 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.02 పైసలు పెరిగి రూ.112.03 గా ఉంది. డీజిల్ ధర రూ.0.11 పైసలు పెరిగి రూ.99.74 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. రూ.0.41 పైసలు తగ్గి ఇవాళ పెట్రోల్ ధర రూ.110.74 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.38 పైసలు తగ్గి రూ.98.51గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.31 పైసలు తగ్గి రూ.112.35 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.29 పైసలు తగ్గి రూ.100.01 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. జూలై 28 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 95.91 డాలర్ల స్థాయిని చేరింది.
Nirmala Sitharaman birthday: నిర్మలా సీతారామన్ @ 63! ఆమె గురించి మీకీ విషయాలు తెలుసా!
Stock Market Opening: నో మూమెంటమ్! 60K తర్వాత సెన్సెక్స్ ఏంటని మదుపరి సందేహం?
Petro-Diesel Price, 18 August: పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయంటే!
Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా
Gudivada Amarnath: వంద ఎకరాలు పైబడిన లేఅవుట్ల వద్ద టెక్స్టైల్ పార్కులు, మంత్రి గుడివాడ రివ్యూ
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా