అన్వేషించండి

Petrol-Diesel Price, 23 April: వాహనదారులకు షాక్! నేడు చాలా చోట్ల ఎగబాకిన పెట్రో ధరలు - హైదరాబాద్‌లో మాత్రం నికలడగానే

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు పది రోజులకు పైగా నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది.

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. ఐదు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం, దేశంలో ఎన్నికలు అన్ని ముగియడంతో క్రూడాయిల్ ధరలు సాధారణంగా ఉన్నా ప్రస్తుతం పెట్రోలు ధరలు మునుపటిలా రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు పది రోజులకు పైగా నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) నేడు ధరలు పెరిగాయి. నేడు (ఏప్రిల్ 23) పెట్రోల్ ధర రూ.0.18 పైసలు పెరిగి రూ.119.18 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.105.19 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో 10 రోజులకు పైగా నిలకడ ధరలే ఉంటున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు తగ్గింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.45 పైసలు తగ్గి రూ.121.23 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.41 పైసలు తగ్గి రూ.107.11 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.07 పైసలు పెరిగి రూ.121.28గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు పెరిగి రూ.106.89 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. నేడు లీటరు ధర రూ.0.59 పైసలు పెరిగి రూ.120.83 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.55 పైసలు పెరిగి రూ.106.42గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.59 పైసలు పెరిగి రూ.122.07 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.55 పైసలు పెరిగి రూ.107.57కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఏప్రిల్ 23 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 102.07 డాలర్ల స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Embed widget