Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
Petrol Diesel Price 19th May 2022 : దేశంలో ఇవాళ(గురువారం) పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా ఉన్నాయి.
Petrol Diesel Price 19th May 2022 : మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. ఐదు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. తాజాగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, దేశంలో ఎన్నికలు అన్ని ముగియడంతో క్రూడాయిల్ ధరలు సాధారణంగా ఉన్నా ప్రస్తుతం పెట్రోలు ధరలు మునుపటిలా రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ స్వల్పంగా పెరిగాయ. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.121.23 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.106.84గా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.120గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.0.30పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.105.65గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. చిత్తూరులో ఇంధన ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర రూ.122.39కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.107.86గా ఉంది.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.105.49గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. నేడు (మే 19) పెట్రోల్ ధర రూ.119.18గా ఉంది. డీజిల్ ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ధర రూ.105.19గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.119.21 ఉంది. డీజిల్ ధర రూ.105.22గా ఉంది. నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలో మార్పు లేదు. పెట్రోల్ ధర లీటరుకు రూ.121.34 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.15 పైసలు తగ్గి రూ.107.20 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.96.67 ఉంది. కోల్ కతాలో పెట్రలో ధర లీటరుకు రూ.115.12గా ఉంటే ముంబయిలో రూ.120.51గా ఉంది. కోల్ కతాలో డీజిల్ ధర లీటర్ రూ.99.83గా ఉంటే ముంబయిలో రూ.104.77 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85గా ఉంది. డీజిల్ ధర రూ.100.94గా ఉంది.