News
News
X

Petrol-Diesel Price, 14 August: నేడు ఈ సిటీలో భారీగా తగ్గిన ఇంధన రేట్లు - ఇక్కడ మాత్రమే పెరుగుదల, తాజా ధరలు ఇవీ

Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత రెండు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది.

FOLLOW US: 

కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత రెండు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.52 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు  స్థిరంగా ఉన్నాయి. నేడు (ఆగస్టు 14) పెట్రోల్ ధర రూ.0.12 పైసలు తగ్గి ధర నేడు రూ.109.16 గా ఉంది. డీజిల్ ధర రూ.0.12 పైసలు తగ్గి రూ.97.34గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.0.34 పైసలు తగ్గి రూ.111.08 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.32 పైసలు తగ్గి నేడు రూ.99.14 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.59 పైసలు తగ్గి రూ.111.50 గా ఉంది. డీజిల్ ధర రూ.0.54 పైసలు తగ్గి రూ.99.27 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. ఇవాళ పెట్రోల్ ధర రూ.110.48 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.98.27 గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.1.69 పైసలు తగ్గి రూ.112.66 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.1.41 పైసలు తగ్గి రూ.100.30 గా ఉంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఆగస్టు 14 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 92.01 డాలర్ల స్థాయిని చేరింది.

Published at : 14 Aug 2022 07:29 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

Petrol Price Today 07 October 2022: వాహనదారులకు ఊరట, స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - అక్కడ భారీగా

Gold Rate Today 07 October 2022: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధరలు, ఊరటనిచ్చిన వెండి 

Gold Rate Today 07 October 2022: పసిడి ప్రియులకు షాక్ - ఎగబాకిన బంగారం ధరలు, ఊరటనిచ్చిన వెండి 

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

భారత్‌ వృద్ది రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంకు- జిడిపి 2022-23 లో 6.5% ఉండొచ్చని అంచనా

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

EPF interest: ఈపీఎఫ్ ఖాతాల్లో కనిపించని వడ్డీ - క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్‌ మినిస్ట్రీ!

EPF interest: ఈపీఎఫ్ ఖాతాల్లో కనిపించని వడ్డీ - క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్‌ మినిస్ట్రీ!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు