By: ABP Desam | Updated at : 13 May 2022 06:39 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. ఐదు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం, దేశంలో ఎన్నికలు అన్ని ముగియడంతో క్రూడాయిల్ ధరలు సాధారణంగా ఉన్నా ప్రస్తుతం పెట్రోలు ధరలు మునుపటిలా రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. కానీ, నేడు (మే 13) పెట్రోల్ ధర రూ.119.00 గా అయింది. డీజిల్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు తగ్గి రూ.120.98 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.17 పైసలు తగ్గి రూ.106.87 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.15 పైసలు పెరిగి రూ.121.44 గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.107.04 గా ఉంది.
ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. ముందు రోజుతో పోలిస్తే లీటరు ధర రూ.0.81 పైసలు తగ్గి రూ.120.00 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.75 పైసలు తగ్గి రూ.105.65గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.40 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర నేడు రూ.121.88 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.37 పైసలు పెరిగి రూ.107.39గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. మే 13 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 107.69 డాలర్ల స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Cryptocurrency Prices Today: నష్టాల్లో బిట్‌కాయిన్.. ఎంత నష్టపోయిందంటే?
Stock Market News: ఆరంభంలో అదుర్స్! ఎండింగ్లో ఒడుదొడుకులు - సెన్సెక్స్, నిఫ్టీ డౌన్!
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!