IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Petrol-Diesel Price, 12 May: నేడు చాలా చోట్ల ఇంధన ధరలు స్థిరం, ఇక్కడ మాత్రం పెరుగుదల

Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది.

FOLLOW US: 

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. ఐదు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం, దేశంలో ఎన్నికలు అన్ని ముగియడంతో క్రూడాయిల్ ధరలు సాధారణంగా ఉన్నా ప్రస్తుతం పెట్రోలు ధరలు మునుపటిలా రోజురోజుకీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.105.49 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price)  ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. కానీ, నేడు (మే 12) పెట్రోల్ ధర రూ.119.00 గా అయింది. డీజిల్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు కాస్త పెరిగింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగి రూ.121.17 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.17 పైసలు పెరిగి రూ.107.04 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.04 పైసలు తగ్గి రూ.121.29 గా ఉంది. డీజిల్ ధర రూ.0.01 పైసలు తగ్గి రూ.106.90 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. ముందు రోజుతో పోలిస్తే లీటరు ధర రూ.0.81 పైసలు పెరిగి రూ.120.81 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.75 పైసలు పెరిగి రూ.106.40గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర నేడు రూ.120.81 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.107.02గా ఉంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. మే 12 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 105.17 డాలర్ల స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.

Published at : 12 May 2022 06:42 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!

Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! జూన్‌ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! జూన్‌ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి