అన్వేషించండి

Petrol-Diesel Price, September 1: పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇంతలా మండుతున్నాయేంటి? మీ నగరంలో రేట్లు ఇవీ

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

Petrol-Diesel Price, 1 September: ఆర్థిక మాంద్యం భయం అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది. దీనికితోడు, వివిధ దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు, చైనాలో కరోనాను అడ్డుకోవడానికి ఆంక్షలు పెంచడం వంటి చర్యలు ఆందోళనలను మరింత పెంచాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్‌ ఆయిల్‌ ధర 2.19 డాలర్లు తగ్గి 89.46 డాలర్ల వద్ద ఉంటే, బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఏకంగా 3.12 డాలర్లు తగ్గి 96.29 డాలర్లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గుతున్నా, అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇప్పటికీ 100 డాలర్ల వద్ద కదలాడుతోంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే మన దేశానికి ఇది ఆందోళనకర అంశం.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో పెట్రోలు, డీజిల్‌ ధరల్లో నిన్నటికి (బుధవారం), ఇవాళ్టికి (గురువారం) పెద్దగా మార్పులు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బాగానే పెరిగాయి. ఈ విషయంలో రాజమహేంద్రవరం రికార్డులు కొడుతోంది.

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (బుధవారం) పోలిస్తే ఇవాళ (గురువారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో లీటరు పెట్రోల్ ధర నేడు ₹ 109.10 గా ఉంది. డీజిల్ ధర ₹ 97.29 వద్ద నిలకడగా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలోనూ స్థిర ధరలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లీటరు పెట్రోలు ధర ₹ 109.32 గా ఉండగా, లీటరు డీజిల్‌ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.50 గా కొనసాగుతోంది. 
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న, ఇవాళ ఒకేలా రూ.111.08 వద్ద ఉంది. డీజిల్ ధర ₹ 99.14 గా ఉంది. 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.41 గా ఉండగా, ఇవాళ 23 పైసలు పెరిగి ₹ 109.64 కి చేరింది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.57 కాగా, ఇవాళ 21 పైసలు పెరిగి ₹ 97.78 వద్ద కొనసాగుతోంది. 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.32 గా ఉండగా, ఇవాళ 46 పైసలు పెరిగి ₹ 109.78 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా ఇవాళ ₹ 0.42 పైసలు పెరిగి ₹ 97.92 కి చేరింది. 
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.83 గా ఉండగా, ఇవాళ 7 పైసలు పెరిగి ₹ 111.90 వద్దకు చేరింది. డీజిల్‌ ధర లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.84  వద్ద ఉండగా, ఇవాళ 6 పైసలు పెరిగి ₹ 99.90 వద్దకు చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్నటి (బుధవారం) ₹ 111.62 నుంచి 32 పైసలు పెరిగి ఇవాళ (గురువారం) ₹ 111.30 కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు తగ్గి ₹ 99.08 గా నమోదైంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.89 నుంచి 11 పైసలు తగ్గి ఇవాళ ₹ 111.78 కి దిగి వచ్చింది. డీజిల్‌ ధర 12 పైసలు తగ్గి ₹ 99.51 గా నమోదైంది. 
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్నటి ₹ 111.19 ఏకంగా ₹ 1.60 పెరిగి  ₹ 112.79 గా నమోదైంది. డీజిల్‌ ధర లీటరుకు ₹ 1.48 పెరిగి ₹ 100.44 వద్దకు చేరింది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.51 కంటే ఇవాళ 31 పైసలు పెరిగి ₹ 110.82 కి పెరిగింది. డీజిల్ ధర 29 పైసలు పెరిగి ₹ 98.59 గా ఉంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 112.66 నుంచి 70 పైసలు తగ్గి ఇవాళ ₹ 111.96 కు చేరింది. డీజిల్ ధర 66 పైసలు తగ్గి ₹ 99.64 గా ఉంది. 
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.71 గా ఉంటే ఇవాళ 56 పైసలు పెరిగి ₹ 112.27 కి చేరింది. డీజిల్ ధర నిన్న, ఇవాళ ₹ 99.46 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.43 గా ఉంటే, ఇవాళ 28 పైసలు పెరిగి ₹ 111.71 కి చేరింది. డీజిల్‌ ధర కూడా 24 పైసలు పెరిగి ₹ 99.44 వద్దకు చేరింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna at Legend 10Years | పసుపు చీరలో సోనాల్ చౌహాన్..కవిత చెప్పిన బాలకృష్ణ | ABPKTR Angry on Leaders Party Change | పార్టీ మారుతున్న బీఆర్ఎస్ లీడర్లపై కేటీఆర్ ఫైర్ | ABP DesamNandamuri Balakrishna at Legend 10Years | లెజెండ్ రీరిలీజ్ లోనూ 100రోజులు ఆడుతుందన్న బాలకృష్ణ | ABPBIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Embed widget