By: ABP Desam | Updated at : 04 Mar 2023 03:15 PM (IST)
Edited By: Arunmali
కార్ ఇన్సూరెన్స్ టైమ్‌లో ఈ సంగతులు గుర్తుంచుకోండి
Car insurance: రోడ్డుపైకి కారు తీసుకెళ్లినప్పుడు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వాహనం లేదా ఇతర కారణం వల్ల ఒక్కోసారి ప్రమాదం జరగవచ్చు. అందుకే వాహన బీమా (Vehicle Insurance) తప్పనిసరిగా చేయించాలి. మీకు సరైన మోటార్ ఇన్సూరెన్స్ ఉంటే, ప్రమాదం జరిగినప్పుడు అది మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. మీ వాహనానికి జరిగిన నష్టాన్ని మాత్రమే కాదు, మీ వాహనం లేదా డ్రైవర్ వల్ల మరొకరికి కలిగే నష్టాన్ని కూడా మోటార్ ఇన్సూరెన్స్ (Motor Insurance) కవర్ చేస్తుంది. వాహనాలకు కొత్తగా బీమా తీసుకునేటప్పుడు, లేదా పాత దానిని పునరుద్ధరించేటప్పుడు (Renewal) కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కు బదులుగా కాంప్రహెన్సివ్ ప్లాన్
వాహన ప్రమాదాల విషయంలో అత్యంత దారుణమైన దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. మన దేశంలో ఏటా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారతదేశంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ (3rd Party Motor Insurance) తప్పనిసరి కావడానికి ఇదే కారణం. అయితే, కేవలం థర్డ్ పార్టీ మోటర్ ఇన్సూరెన్స్ కోసం చూడకుండా, దానికి బదులుగా సమగ్రమైన కవరేజ్ తీసుకోవాలని ఎక్స్‌పర్ట్‌లు ఎల్లడూ సలహా ఇస్తుంటారు. ఎందుకంటే, మూడో పక్షం బీమా కంటే కాంప్రహెన్సివ్ కవరేజ్ వల్ల మెరుగైన రక్షణ లభిస్తుంది.
కాంప్రహెన్సివ్ ప్లాన్ వల్ల ప్రయోజనాలు
ప్రమాదం జరిగినప్పుడు లేదా వాహనానికి ఏదైనా నష్టం జరిగినప్పుడు బీమా చేసిన వ్యక్తికి, మూడో పక్షానికి సమగ్ర బీమా వర్తిస్తుంది. దీంతో పాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ (Personal Accident Cover), ఓన్ డ్యామేజ్ కవర్ (Own Damage Cover), 24 గంటల రహదారి సహాయం (24/7 Road Side Assistance), దొంగతనం నుంచి రక్షణ (Theft Protection) తదితర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. మూడో పక్షం బీమాలో థర్డ్ పార్టీ బాధ్యతలు మాత్రమే కవర్ అవుతాయి.
కవరేజ్ అవసరమైన సందర్భంలో విజయవంతంగా క్లెయిమ్ చేసేందుకు.. మీరు మీ పాలసీని అర్థం చేసుకోవడం, క్లెయిమ్ చేయడానికి సరైన విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు అభ్యర్థించిన క్లెయిమ్‌ను కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీ తిరస్కరించవచ్చు. మీరు తగిన శ్రద్ధ పెడితే, క్లెయిమ్ తిరస్కరణ నుంచి మినహాయింపు పొందవచ్చు.
బీమా తీసుకునే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసే ముందు ఆ బీమాను ఇతర ప్లాన్‌లతో సరిపోల్చండి. మీ అవసరానికి అనుగుణంగా ఫీచర్లు, ప్రయోజనాలు, ప్రీమియం ఉన్నాయో, లేదో నిర్ధరించుకోండి.
బీమా పాలసీ కొనుగోలు చేసేటప్పుడే బీమా క్లెయిమ్ చేసే విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఇలాంటి అవగాహన లేకపోవడమే క్లెయిమ్ తిరస్కరణకు అతి పెద్ద కారణం.
ప్రమాదం జరిగిన తర్వాత క్లెయిమ్ చేయడంలో తాత్సారం చేయొద్దు. క్లెయిమ్ చేయడంలో మీరు ఎంత ఎక్కువ ఆలస్యం చేస్తే, తిరస్కరణ ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది.
మీకు తెలీని, వాస్తవం కాని అంశాలను ప్రస్తావించవద్దు. క్లెయిమ్ చేసేటప్పుడు నిజాయితీగా ఉండి, పారదర్శకతతో పని చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
బీమాను కొనుగోలు చేసేటప్పుడే, సంబంధిత కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎంత ఉందో తనిఖీ చేయడం మరిచిపోవద్దు.
Risk Free Pension Plan : రిస్క్ లేని పెట్టుబడికి LIC New Jeevan Shanti బెస్ట్.. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం సంవత్సరానికి లక్ష రూపాయల పెన్షన్
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Digital Gold:సెబీ హెచ్చరికను పట్టించుకోని ప్రజలు! 11 నెలల్లో 12 టన్నుల డిజిటల్ బంగారం కొనుగోలు!
శాంసంగ్ ఫోల్డ్‌బుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ