By: ABP Desam | Updated at : 15 Dec 2021 01:18 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ తెలుసు! అందుకే ఈ పొట్టి సందేశాల యాప్ లేని ఫోన్ అస్సలు ఉండదంటే అతిశయోక్తి కాదేమో! చాలామంది వాట్సాప్‌ను రాతపూర్వక సందేశాలు పంపించేందుకే ఉపయోగిస్తారు. అదే స్థాయిలో వాయిస్ మెసేజ్‌లనూ పంపించేవాళ్లు ఉంటారు.
తమకు ప్రియమైన వారికి పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వాయిస్ సందేశాలను ఉపయోగిస్తుంటారు. మరికొందరు తమ చిన్నారుల ముద్దు ముద్దు మాటలను వింటుంటారు. టెక్ట్స్ టైప్ చేయలేని పెద్దలు, నిరక్షరాస్యులు చెప్పాలనుకున్న వివరాలను వాయిస్ ద్వారా పంపిస్తారు. ఇలా చేసేటప్పుడు ఒక సమస్య ఎదురవుతుంటుంది.
They’re not mistakes, they’re rehearsals. Now you can preview your voice messages before you hit send. pic.twitter.com/ohnEVrGTvD
— WhatsApp (@WhatsApp) December 14, 2021
మాటలు తడబడ్డా, తప్పు పలికినా, సరిగ్గా రికార్డు చేయకపోయినా అవతలివారికి పంపించే సందేశం ఇబ్బంది కరంగా ఉంటుంది. కొన్నిసార్లు తప్పుడు అర్థాలు వచ్చి అనర్థాలకు దారితీస్తాయి. అందుకే వాట్సాప్ తాజాగా మరో అప్‌డేట్ తీసుకొచ్చింది. వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్‌ను అందిస్తోంది. దీంతో మీరు రికార్డు చేసిన సందేశాలను మొదట మీరు విని సరిగ్గా ఉన్నాయనుకుంటేనే అవతలి వారికి సెండ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, డెస్క్‌టాప్ అన్ని వెర్షన్లలోనూ ఇది పనిచేస్తుంది.
రికార్డింగ్ ముగించేందుకు స్టాప్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ప్రివ్యూ వాయిస్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత త్రిభుజాకార ప్లే ఐకాన్ టచ్ చేసి సందేశాన్ని వినొచ్చు. బాగా ఉందనిపిస్తే పంపించొచ్చు. లేదంటే డిలీట్ చేసి, మళ్లీ రికార్డు చేసి సెండ్ చేయొచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం వాబీటా బ్లాగులో ఉంచింది వాట్సాప్.
Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!
Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
New Aadhaar App: నకిలీ ఆధార్ కార్డును గుర్తుపట్టేది ఎలా? కొత్త ఆధార్ యాప్ ఎలా పని చేస్తుంది?
Aadhaar App: కొత్త ఆధార్ యాప్‌లో విప్లవాత్మక మార్పులు- మీ ఫ్యామిలీ కార్డులు ఎలా యాడ్ చేయాలి?
Car loan Interest Rate: ఏ బ్యాంక్ అతి తక్కువ వడ్డీకి కార్ లోన్ ఇస్తుంది.. టాప్ 5 లిస్ట్ చూసి ఫిక్స్ అవ్వండి
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి-షిర్డీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, తేదీలు ఇవే!
Hyderabad Global City : గ్లోబల్ సిటీగా హైదరాబాద్! ఇంతకీ దీన్ని ఎవరు గుర్తిస్తారు? ఉండాల్సిన లక్షణాలేంటీ?
Fact Check: కేంద్రం 'ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇస్తోందా? విద్యార్థుల ఆశలతో ఆడుకుంటున్న డిజిటల్ దుర్వినియోగం
Rajamouli Hanumuthu Issue: ఆంజనేయునిపై రాజమౌళి వ్యాఖ్యలపై రాజకీయం - క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేయాలని బీజేపీ సలహా