search
×

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీని మధ్యలోనే ఆపేశారా?, రీస్టార్ట్ చేసే అవకాశం వచ్చింది

2023 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు ఈ ప్రచార కార్యక్రమం (LIC Special Revival Campaign) కొనసాగుతుంది.

FOLLOW US: 
Share:

LIC Policy: మీరు ఇంతకు ముందు ఎల్‌ఐసీ బీమా పాలసీని తీసుకుని, దాని మెచ్యూరిటీ తేదీ కంటే అనివార్య కారణాల వల్ల డబ్బులు కట్టడం ఆపేశారా?, ఇప్పుడు అదే పాలసీని మళ్లీ కొనసాగించాలని ఆలోచిస్తున్నారా?, ఇలాంటి ఆలోచన మీకు ఉంటే ఈ వార్త మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.                        

మీరు మధ్యలోనే వదిలేసిన ‍‌ఎల్‌ఐసీ పథకాన్ని (Lapsed LIC Policy) తిరిగి ప్రారంభించే అవకాశం కూడా ఉంది. పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసిన పాత పాలసీలను పునరుద్ధరించడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 1 నుంచి 2023 మార్చి 24 వరకు ఈ ప్రచార కార్యక్రమం (LIC Special Revival Campaign) కొనసాగుతుంది.

LIC ప్రారంభించిన ప్రచార కార్యక్రమం కింద మీరు మీ పాత LIC పాలసీని పునరుద్ధరించుకోవడంతో పాటు, కొంత ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. 

మామూలుగా అయితే, ఎల్‌ఐసీ ప్రీమియం కట్టడంలో ఎవరైనా జాప్యం చేస్తే, ఎల్‌ఐసీ కొంత ఆలస్య రుసుము (Late Fee) వసూలు చేస్తుంది. ఇప్పుడు, ఈ ప్రచార కార్యక్రమం సందర్భంగా, ప్రీమియం ఆలస్య రుసుములో కొంత మినహాయింపు కూడా ఇస్తున్నట్లు లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్‌ చేసింది.

ఆలస్య రుసుములో మినహాయింపు
మీరు చెల్లించాల్సిన ప్రీమియం ఒక లక్ష రూపాయల వరకు ఉంటే, ఆలస్య రుసుముపై 25 శాతం లేదా గరిష్టంగా రూ. 2500 వరకు రాయితీ ఇస్తోంది.
మీరు చెల్లించాల్సిన ప్రీమియం రూ. 3 లక్షల వరకు ఉంటే, ఆలస్య రుసుముపై 25 శాతం లేదా గరిష్టంగా రూ. 3000 వరకు రాయితీ ఇస్తోంది.
మీరు చెల్లించాల్సిన ప్రీమియం రూ. 3 లక్షలు దాటితే, ఆలస్య రుసుముపై 30 శాతం లేదా గరిష్టంగా రూ. 3500 వరకు రాయితీ ఇస్తోంది.

పాలసీ పునరుద్ధరణకు 5 సంవత్సరాల గడువు
మీరు, మీ LIC పాలసీకి ప్రీమియం చెల్లించని తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు, అదే పాలసీని పునఃప్రారంభించడానికి అవకాశం ఉంది.

LIC మరో స్పెషల్‌ ఆఫర్‌ కూడా ఇచ్చింది. అర్హత కలిగిన NACH & BILL Pay రిజిస్టర్డ్ పాలసీలపై ఆలస్య రుసుముగా కేవలం రూ.5 (GST అదనం) విధించవచ్చు. 

మీ పాలసీని పునరుద్ధరించుకోవాలంటే ఆన్‌లైన్‌ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. లేదా, బీమా కంపెనీ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా లేదా ఏజెంట్ ద్వారా చెల్లించవచ్చు. 

ఎవరికి ప్రయోజనం ఉండదు?
టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మల్టిపుల్ రిస్క్‌లతో కూడిన పాలసీలు వంటి హై రిస్క్ ప్లాన్‌లకు పునరుద్ధరణ ప్రయోజనం ఉండదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దేశంలోని ప్రతి వర్గానికీ ఉపయోగపడేలా పాలసీలను ప్రవేశపెడుతోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఎల్‌ఐసీ వద్ద ఒక ప్లాన్‌ దొరుకుతుంది. ఈ పాలసీల కింద భద్రతతో పాటు, పొదుపు కూడా చేయవచ్చు.

Published at : 07 Feb 2023 04:06 PM (IST) Tags: Life Insurance Corporation Lic lic policy Lapsed LIC Policy restart LIC Policy

సంబంధిత కథనాలు

Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి

Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి

Fraud alert: పేమెంట్‌ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్‌!

Fraud alert: పేమెంట్‌ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్‌!

Fixed Deposits: భారీ వడ్డీని అందించే స్పెషల్‌ FDలు ఇవి, ఇదే చివరి అవకాశం

Fixed Deposits: భారీ వడ్డీని అందించే స్పెషల్‌ FDలు ఇవి, ఇదే చివరి అవకాశం

Gold-Silver Price 21 March 2023: పసిడి ధర భారీగా పతనం, అయినా హైరేంజ్‌లోనే రేటు

Gold-Silver Price 21 March 2023: పసిడి ధర భారీగా పతనం, అయినా హైరేంజ్‌లోనే రేటు

SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌

SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!