అన్వేషించండి

PPF Investment Tips : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ "ఐదో తేదీ" రూల్‌ మర్చిపోకండి!

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే వారు చాలా మంది ఎంత పెట్టుబడి పెడుతున్నామని ఆలోచిస్తారు. తేదీ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఏ సమయంలో పెడితే ఎంత ప్రయోజనమో తెలుసుకోవడం చాలా మంచిది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పీపీఎఫ్ వడ్డీ లెక్కలో నెల 5వ తేదీ కీలకం.
  • 5వ తేదీ లోపు డిపాజిట్ చేస్తే పూర్తి నెల వడ్డీ లభిస్తుంది.
  • ఆర్థిక సంవత్సరం మొదట్లోనే లేదా ప్రతి నెలా 5 లోపు పెట్టుబడి పెట్టాలి.
  • పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1% కొనసాగుతోంది, పన్ను మినహాయింపులు ఉన్నాయి.

PPF Investment Tips : మధ్యతరగతి ప్రజలకు అత్యంత సురక్షితమైన, నమ్మకమైన పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్‌ ఫండ్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ప్రభుత్వ హామీ ఉండటం, పన్ను మినహాయింపు ఉండటంతో చాలా మంది ఈ విధానంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలా మంది పెట్టుబడిదారులు పీపీఎఫ్ వడ్డీ గణన వెనుక ఉన్న అసలు సూత్రాన్ని గమనించకపోవడంతో చాలా నష్టపోతున్నారు. తమకు వీలైనప్పుడు డిపాజిట్ చేసి కొంత వడ్డీని కోల్పోతుంటారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన వేళ ఇన్వెస్టర్లు తమ లాభాలను ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోవడం చాలా అవసరం. 

వడ్డీ లెక్కింపులో ఐదో తేదీ చాలా కీలకం

పీపీఎఫ్ రూల్ ప్రకారం వడ్డీని లెక్కించేటప్పుడు ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. ప్రతి నెల ఐదో తేదీ ముగింపు, ఆ నెల చివరి రోజు మధ్య కనిష్ట బ్యాలెన్స్‌పై మాత్రమే వడ్డీ లెక్కిస్తారు. అంటే ఒక నెలలో ఐదో తేదీ లోపు డబ్బు డిపాజిట్ చేస్తే ఆ నెల మొత్తానికి మీకు వడ్డీ లభిస్తుంది. ఒక వేల మీరు ఐదే తేదీ తర్వాత అంటే ఆరున డిపాజిట్ చేసినా, ఆ నెలలో మీ ఖాతాలోని కనిష్ట బ్యాలెన్స్ తక్కువగా ఉంటుందని కాబట్టి ఆ నెల వడ్డీని మిస్ అవుతారు. 

ఏప్రిల్‌ ఐదో తేదీలోపు మీరు నగదు జమ చేస్తే ఏప్రిల్ నెల వడ్డీ కూడా మీ ఖాతాలో చేరుతుంది. కానీ ఏప్రిల్ ఆరు తర్వాత జమ చేస్తే పెట్టుబడిపై వడ్డీ మే నెల నుంచి ప్రారంభమవుతుంది. ఇలా ప్రతి నెలా ఆలస్యమైతే ఏడాదికి ఒక నెల వడ్డీ చొప్పున 15 ఏళ్లు మెచ్యూరిటీ కాలంలో భారీ మొత్తాన్ని కోల్పోతారు. 

రెండు మార్గాల్లో పెట్టుబడి 

పెట్టుబడిదారులు పీపీఎఫ్ ఖాతా నుంచి గరిష్ట ప్రయోజనం పొందాలంటే రెండు పద్దతులు ఉన్నాయి. ఒకేసారి భారీ మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్ 5లోపు గరిష్ట పరిమితి అయిన 1.5 లక్షలను డిపాజిట్ చేయడం మంచిది. దీని వల్ల పూర్తి పెట్టుబడిపై ఏడాది పొడవునా 12 నెలల వడ్డీ వస్తుంది. 

మీరు ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటే కచ్చితంగా ప్రతి నెల ఐదు లోపు డిపాజిట్ చేయాలి. దీని వల్ల ఒక్క రూపాయి వడ్డీ కూడా  పోదు. 

ప్రస్తుతం వడ్డీ రేట్లు  

ప్రభుత్వం 2026 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను పీపీఎఫ్ వడ్డీ రేటును 7.1శాతం వద్ద యథాతథంగా కొనసాగుతుంది. ఇది వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో ఇలానే ఉంది. సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. 15 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం నగదు పూర్తిగా పన్ను రహితం.  

పీపీఎఫ్ అనేది 15ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ కలిగిన దీర్ఘకాలిక పథకం అయినప్పటికీ ఖాతా ప్రారంభించిన మూడో ఏడాది నుంచి ఆరో సంవత్సరం వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. ఏడేళ్ల నుంచి రూల్స్ ప్రకారం కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాదికి కనీసం  500 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 

Frequently Asked Questions

పీపీఎఫ్ వడ్డీని ఎలా లెక్కిస్తారు?

పీపీఎఫ్ వడ్డీని ప్రతి నెల ఐదో తేదీ ముగింపు, ఆ నెల చివరి రోజు మధ్య ఉన్న కనిష్ట బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. ఐదో తేదీ లోపు డిపాజిట్ చేస్తే ఆ నెల మొత్తానికి వడ్డీ వస్తుంది.

పీపీఎఫ్ లో పెట్టుబడిపై వడ్డీని ఎప్పుడు కోల్పోతాము?

ఐదో తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే ఆ నెల వడ్డీని కోల్పోతారు. దీనివల్ల మెచ్యూరిటీ కాలంలో భారీ మొత్తాన్ని నష్టపోయే అవకాశం ఉంది.

పీపీఎఫ్ లో గరిష్ట ప్రయోజనం పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటి?

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో, ఏప్రిల్ 5 లోపు గరిష్ట పరిమితి అయిన 1.5 లక్షలను ఒకేసారి డిపాజిట్ చేయడం మంచిది. ప్రతి నెలా డిపాజిట్ చేస్తే, ప్రతి నెలా ఐదు లోపు చేయాలి.

పీపీఎఫ్‌లో ప్రస్తుత వడ్డీ రేటు ఎంత?

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1%గా ఉంది. ఇది వరుసగా ఎనిమిదో త్రైమాసికంగా స్థిరంగా ఉంది.

పీపీఎఫ్‌లో లోన్ లేదా విత్‌డ్రా సౌకర్యం ఉందా?

ఖాతా ప్రారంభించిన మూడో ఏడాది నుంచి ఆరో సంవత్సరం వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఏడేళ్ల నుంచి రూల్స్ ప్రకారం కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget