By: ABP Desam | Updated at : 14 Apr 2023 04:06 PM (IST)
Edited By: Arunmali
పాన్-ఆధార్ లింక్ రూల్స్ మార్పు
PAN-Aadhaar Link Update: పాన్ కార్డ్‌హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఊరట ప్రకటించింది. పాన్-ఆధార్ నంబర్ అనుసంధానం గడువును ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఇది కాకుండా, తాజాగా మరో అప్‌డేట్ కూడా వచ్చింది. ఒకవేళ మీరు మీ పాన్-ఆధార్ లింక్ చేయాలని అనుకుంటుంటే, ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
పాన్-ఆధార్ లింకింగ్ అప్‌డేట్
మీ పాన్-ఆధార్‌ను లింక్ చేస్తున్నప్పుడు, రూ. 1000 ఆలస్య రుసుమును చెల్లించే ముందే మీరు తప్పనిసరిగా మదింపు సంవత్సరం లేదా అసెస్‌మెంట్ ఇయర్‌ను (AY) ఎంచుకోవాలి. ఆదాయపు పన్ను విభాగం కొత్తగా ఈ ఆప్షన్ ఇచ్చింది. రూ.1000 ఆలస్య రుసుము కట్టడానికి ముందు, AY 2024-25ని ఎంచుకోవాలి. ఆ తర్వాత, 'అదర్ రిసిప్ట్స్'ను (Other Receipts) డిపాజిట్ టైప్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు డబ్బు చెల్లించాలి. గత డెడ్‌లైన్ అయిన 2023 మార్చి 31వ తేదీకి ముందు అసెస్‌మెంట్ ఇయర్ AY 2023-24గా ఉంది.
కొత్త గడువైన జూన్ 30వ తేదీ లోగా పాన్ కార్డ్‌హోల్డర్ తన ఆధార్‌ను లింక్ చేయకపోతే, సంబంధిత వ్యక్తికి చెందిన పాన్ కార్డ్ నిష్క్రియంగా (నాన్-ఆపరేటివ్) మారుతుంది. ఈ గడువు తర్వాత రూ. 10,000 ఫైన్ చెల్లించాల్సి వస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
1: ఆదాయ పన్ను విభాగం అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్ ‘https://www.incometax.gov.in/iec/foportal/’ ని సందర్శించండి.
2: వెబ్‌పేజీలోని 'Quick Links' విభాగంలో ఉన్న 'లింక్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి.
3: ఇది మిమ్మల్ని కొత్త పేజీకి తీసుకెళ్తుంది. మీరు మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పేరు వంటి ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
SMS ద్వారా పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
1. మీ రిజిస్టర్డ్ మొబైల్‌లో 'UIDPAN < 12 అంకెల ఆధార్ సంఖ్య > < 10 అంకెల పాన్ >' అని టైప్ చేయండి
2. ఆ సందేశాన్ని 56161 లేదా 567678కి ఈ SMS చేయండి.
ఇప్పటికే పాన్-ఆధార్ లింక్ చేస్తే, దాని స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
1. ఆదాయ పన్ను విభాగం అధికారిక పోర్టల్ www.incometax.gov.in/iec/foportal/ లో సైన్ ఇన్ చేయకుండానే పాన్-ఆధార్ లింక్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
2. ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీలో, 'Quick Links' విభాగంలోకి వెళ్లి, 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి.
3. మీ పాన్, ఆధార్ నంబర్లను సంబంధిత గడుల్లో నమోదు చేసి, 'View Linked Aadhaar Status' మీద క్లిక్ చేయండి.
ధృవీకరణ విజయవంతం కాగానే, పాన్-ఆధార్ అనుసంధాన స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.
పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏంటి నష్టం?
కొత్త గడువు లోగా కూడా పాన్-ఆధార్ లింక్ చేయని పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్ రాదు. PAN పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అటువంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ మొత్తంలో TDS, TCS వసూలు చేస్తారు.
పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి, రూ. 1,000 చెల్లించిన తర్వాత, 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.
ఇప్పటి వరకు 51 కోట్లకు పైగా పాన్‌లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Small Business Ideas : గ్రామాల్లోనే ఉంటూ అధిక ఆదాయం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన 7 బిజినెస్ ఐడియాలు
Silver Prices : మొదటిసారిగా 3 లక్షలు దాటిన వెండి! ఇప్పుడు 1 కిలో ధర ఎంత ఉందో తెలుసుకోండి?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!