అన్వేషించండి

Multibagger Share: తగ్గేదే లే! అంటున్న మల్టీబ్యాగర్‌ షేరు ధర! వారంలోనే ఇన్వెస్టర్లకు డబ్బుల పంట!

Multibagger Share Price: సాధారణంగా ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు ఎక్కువగా పెరగవు! ఆ కంపెనీ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏడాదిలోనే 100 శాతానికి పైగా రాబడి...

Multibagger share Massive rally in Oil India makes it a multibagger in one year : సాధారణంగా ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు ఎక్కువగా పెరగవు! మిగతా వాటితో పోలిస్తే షేర్ల ధరల్లో పెద్దగా మార్పుండదు. ఎక్కువగా గ్రోత్‌ కనిపించదు. ఆయిల్‌ ఇండియా (Oil India) మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏడాదిలోనే 100 శాతానికి పైగా రాబడి ఇవ్వడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ మల్టీ బ్యాగర్‌ను చూసి మురిసిపోతున్నారు.

ఆయిల్ ఇండియా షేరు (Oil India Share Price) గురువారం రూ.282 వద్ద మొదలైంది. మధ్యాహ్నం రూ.306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 18 రూపాయిల లాభంతో 298 వద్ద ముగిసింది. మే 30 నుంచి ఈ షేరు ధర తగ్గేదే లే! అన్నట్టుగా పైపైకి వెళ్తోంది. ఆ రోజు రూ.224గా ఉన్న షేరు 8 రోజుల్లోనే రూ.297కు చేరుకుంది. ఇంకా చెప్పాలంటే రూ.305 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. మే 27న కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. ముడి చమురు ధరల వల్ల మార్జిన్‌ మనీ పెరిగింది. దాంతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్రోకింగ్‌ కంపెనీలు రూ.305 టార్గెట్‌ ఇవ్వగా ఇప్పటికే దానిని అందుకుంది.

'సాధారణంగా మా మార్జిన్లు బాగుంటాయి. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల లాభదాయకత ఇంకా పెరిగింది. ఎందుకంటే యుద్ధం వల్ల డీజిల్‌ స్పెడ్‌ పెరిగింది. మాది సహజంగానే డీజిల్‌ రిఫైనరీ. హైడ్రోక్రాకర్‌ సైతం ఉంది. దాంతో డీజిల్‌ ఉత్పత్తిని మరింత పెంచాం. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి రెండు నెలల్లో రాబడి మరింత మెరుగ్గా ఉంటుంది' అని ఆయిల్‌ ఇండియాకు చెందిన నుమలిగఢ్‌ రిఫైనరీ ఎండీ భాస్కర్‌ జ్యోతి ధీమా వ్యక్తం చేశారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget