By: ABP Desam | Updated at : 21 Jan 2023 01:20 PM (IST)
Edited By: Arunmali
ఎల్‌ఐసీ కొత్త ప్లాన్ 'జీవన్ ఆజాద్'
LIC Jeevan Azad: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation - LIC), జీవన్ ఆజాద్ (Plan No. 868) పేరుతో కొత్త పాలసీని ప్రారంభించింది. పొదుపుతో పాటు జీవిత బీమాను అందించే సరికొత్త పథకం ఇది. దీని ద్వారా పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రత, పొదుపు ప్రయోజనం రెండూ అందుతాయి.
ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ పథకం కింద రూ. 5 లక్షల వరకు (Sum Assured) బీమా కవరేజ్ ఉంటుంది. దీంతో పాటు, ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్ కింద మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
LIC జీవన్ ఆజాద్ అనేది.. పరిమిత కాల చెల్లింపు ఎండోమెంట్ ప్లాన్. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారు దురదృష్టవశాత్తు మరణిస్తే, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ఈ పథకం అందిస్తుంది. ఈ పథకం కింద రుణ సౌలభ్యం కూడా ఉంది. మెచ్యూరిటీ తేదీ నాటికి పాలసీదారు జీవించి ఉంటే, జీవిత బీమాకు హామీ ఇచ్చిన మొత్తం చేతికి వస్తుంది.
హామీ మొత్తం ఎంత?
ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ పథకం కింద కనిష్ట ప్రాథమిక హామీ కింద రూ. 2 లక్షలు, గరిష్ట ప్రాథమిక హామీ కింద రూ. 5 లక్షలు ఇస్తారు. ఈ పాలసీని కనిష్ట కాల వ్యవధి 15 సంవత్సరాలు, గరిష్ట కాల వ్యవధి 20 సంవత్సరాలు.
ఎన్ని సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి?
ఈ ప్లాన్‌లో ప్రీమియం చెల్లింపు వ్యవధి మైనస్ 8 (-8) సంవత్సరాలుగా ఉంటుంది. అంటే.. పాలసీ చెల్లింపు వ్యవధి కంటే 8 సంవత్సరాల ముందే ప్రీమియం చెల్లింపు పూర్తవుతుంది. ఉదా... మీరు 20 ఏళ్ల కాల వ్యవధి ఆప్షన్‌ను ఎంచుకుంటే (20-8), 12 ఏళ్ల పాటు ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ కింద ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 8 సంవత్సరాలు కూడా మీరు పాలసీ కవరేజ్‌లో ఉంటారు.
పాలసీదారు వెసులుబాటును బట్టి వార్షిక (12 నెలలకు ఒకసారి) లేదా అర్ధ వార్షిక (6 నెలలకు ఒకసారి) లేదా త్రైమాసిక (3 నెలలకు ఒకసారి) లేదా నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు.
పాలసీదారు వయస్సు ఎంత ఉండాలి?
LIC ఆజాద్ ప్లాన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. పాలసీదారు వయస్సు కనిష్టంగా 90 రోజుల నుంచి గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఉండాలి. అంటే, మూడు నెలల వయస్సున్న పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. దీనితో పాటు, మీకు 50 ఏళ్లు నిండినప్పటికీ ఆ తర్వాత 8 సంవత్సరాల పాటు పాలసీ కవరేజ్‌లో ఉంటారు.
డెట్ బెనిఫిట్ ఎంత ఉంటుంది?
బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే మరణిస్తే, ఈ పథకం కింద డెత్ బెనిఫిట్ లభిస్తుంది. మరణ ప్రయోజనం బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు సమానంగా ఉంటుంది. పాలసీదారు మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో ఇది 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. సంప్రదాయ బీమా పాలసీల్లో వచ్చే రాబడి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏదైనా పాలసీని కొనే ముందు ఆ పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదవడం, ఎల్‌ఐసీ ఏజెంట్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. మీ అవసరాలకు తగినట్లుగా ఉంటేనే ఏ పాలసీ అయినా తీసుకోండి. వీలయితే ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మేలు.
Home Tax benefits: నిర్మాణంలో ఉన్న ఇంటిని కొని EMIలు కడుతుంటే, పన్ను మినహాయింపు వర్తిస్తుందా?
Gold-Silver Price 03 February 2023: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు - సామాన్యుడు కొనే పరిస్థితే లేదు
Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!
Income Tax Slab: గుడ్‌న్యూస్! రూ.7 లక్షల వరకు 'పన్ను' లేదు - పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు!
New Tax Regime: రూ.9 లక్షల ఆదాయానికి రూ.45వేలు, రూ.15 లక్షలకు రూ.1.5 లక్షలే టాక్స్!
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్