By: Arun Kumar Veera | Updated at : 02 Jan 2025 11:17 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 01 జనవరి 2025 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: సానుకూల పవనాల మధ్య గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు పుంజుకుంది. 2024లో పసిడి ధర 26% పెరిగింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,645 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 330 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 300 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 250 రూపాయల చొప్పున పెరిగాయి. దీంతో, స్వచ్చమైన బంగారం ధర (24K) 100 గ్రాములకు రూ.3,300 పెరిగింది. నిన్న కూడా పసిడి రేటు పెరిగింది. ఈ రెండు రోజుల్లో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు, రూ.98 వేల దగ్గర ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,330 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,800 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 98,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,330 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,800 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 98,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
| ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
| హైదరాబాద్ | ₹ 78,330 | ₹ 71,800 | ₹ 58,750 | ₹ 98,000 |
| విజయవాడ | ₹ 78,330 | ₹ 71,800 | ₹ 58,750 | ₹ 98,000 |
| విశాఖపట్నం | ₹ 78,330 | ₹ 71,800 | ₹ 58,750 | ₹ 98,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
| ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
| చెన్నై | ₹ 7,180 | ₹ 7,833 |
| ముంబయి | ₹ 7,180 | ₹ 7,833 |
| పుణె | ₹ 7,180 | ₹ 7,833 |
| దిల్లీ | ₹ 7,195 | ₹ 7,848 |
| జైపుర్ | ₹ 7,195 | ₹ 7,848 |
| లఖ్‌నవూ | ₹ 7,195 | ₹ 7,848 |
| కోల్‌కతా | ₹ 7,180 | ₹ 7,833 |
| నాగ్‌పుర్ | ₹ 7,180 | ₹ 7,833 |
| బెంగళూరు | ₹ 7,180 | ₹ 7,833 |
| మైసూరు | ₹ 7,180 | ₹ 7,833 |
| కేరళ | ₹ 7,180 | ₹ 7,833 |
| భువనేశ్వర్ | ₹ 7,180 | ₹ 7,833 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
| దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
| దుబాయ్ (UAE) | ₹ 6,810 | ₹ 7,352 |
| షార్జా (UAE) | ₹ 6,810 | ₹ 7,352 |
| అబు ధాబి (UAE) | ₹ 6,810 | ₹ 7,352 |
| మస్కట్ (ఒమన్) | ₹ 6,947 | ₹ 7,392 |
| కువైట్ | ₹ 6,692 | ₹ 7,298 |
| మలేసియా | ₹ 6,954 | ₹ 7,241 |
| సింగపూర్ | ₹ 6,833 | ₹ 7,582 |
| అమెరికా | ₹ 6,676 | ₹ 7,104 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 300 పెరిగి రూ. 25,210 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఇది దేశంలోనే అత్యంత చవకైన బీమా పాలసీ, కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజ్
Aadhaar and PAN cards Linked: మీ ఆధార్ పాన్ కార్డు లింక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి! లేకపోతే జనవరి 1 నుంచి ఇబ్బందులు తప్పవు!
New Year Offer: కొత్త సంవత్సరానికి బంపర్ ఆఫర్! ఈ కంపెనీ ఉచితంగా అదనపు డేటాను అందిస్తోంది! పరిమిత ఆఫర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి?
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Silver Price: వెండి మెరుపు ముందు వెలవెలబోయిన బంగారం, స్టాక్ మార్కెట్! ఏడాదిలో 130% కంటే ఎక్కువ పెరుగుదల!
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !