By: Arun Kumar Veera | Updated at : 31 Dec 2024 09:53 AM (IST)
కవరేజ్ ఎలా పొందాలి? ( Image Source : Other )
Cheapest Life And Accidental Insurance Policy: ప్రజలందరికి, ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఉన్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా జీవిత బీమాను ఉండాలి. జీవిత బీమా కవరేజ్ ఉన్న వ్యక్తి, తన మరణం తర్వాత కూడా తన కుటుంబాన్ని అనాధగా వదిలి పెట్టడు, కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బును సమకూర్చి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నప్పటికీ, ఏ పాలసీ తీసుకోవాలి లేదా ఏది తీసుకోకూడదు అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. ప్రస్తుతం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సహా చాలా ప్రైవేట్ బీమా కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయిస్తున్నాయి. వీటిలో ఒక్కో పాలసీ లక్షణాలు ఒక్కోలా, ధరలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే బీమా పాలసీ దేశంలోనే అత్యంత చవకైననది. మీరు దీనిని కేవలం 45 పైసలకే కొనుగోలు చేయొచ్చు, తద్వారా రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.
దేశంలో అత్యంత చవకైన బీమా పాలసీ
ఈ బీమా పాలసీని రైలు ప్రయాణ సమయంలో మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇది ITCTC వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మీరు రైలు టిక్కెట్‌ను బుక్ చేసినప్పుడు, దానితో పాటు ప్రయాణ బీమా పాలసీ కూడా అందుబాటులో ఉంటుంది. రైలు ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగి పాలసీహోల్డర్ మరణిస్తే లేదా తీవ్రంగా గాయపడినట్లయితే, ఈ ప్రయాణ బీమా పాలసీ ఉపయోగపడుతుంది.
చెల్లుబాటు కాల వ్యవధి
ఇంతకుముందు ఈ పాలసీ 35 పైసలకు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు దాని ధర 45 పైసలకు పెరిగింది. అయినప్పటికీ, ఇది దేశంలోనే చవకైన బీమా పాలసీ. వాస్తవానికి, ఈ బీమా పాలసీ కొన్ని గంటలు లేదా రోజుల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే, ట్రైన్ టిక్కెట్‌తో పాటు ఈ బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, మీరు రైలులో ప్రయాణిస్తున్న కాలానికి మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకోగానే ఈ పాలసీ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: సీటీసీకి, చేతికొచ్చే జీతానికి మధ్య ఇంత తేడా ఎందుకు, పే స్లిప్‌లో ఎలాంటి కటింగ్స్ ఉంటాయ్?
కవరేజ్ ఎలా పొందాలి?
IRCTC ప్రయాణ బీమా పాలసీ కింద, మూడు రకాల కవరేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. పాలసీహోల్డర్ రైలు ప్రమాదంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 10 లక్షల బీమా డబ్బు అందుతుంది. ప్రయాణ సమయంలో రైలు ప్రమాదంలో పాలసీహోల్డర్ శాశ్వతంగా దివ్యాంగుడిగా మారినా రూ. 10 లక్షల కవరేజీ వర్తిస్తుంది.
రైలు ప్రమాదంలో తాత్కాలిక వైకల్యం ఉంటే రూ. 7.50 లక్షల కవరేజ్ లభిస్తుంది. రైలు ప్రమాదంలో స్వల్పంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వచ్చినా కూడా ఈ పాలసీ పని చేస్తుంది, రూ. 2 లక్షల వరకు కవరేజ్ ఇస్తుంది.
మరో ఆసక్తికర కథనం: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఆరేళ్లుగా అన్యాయం!, కొత్త సంవత్సరంలో తీరు మారుతుందా?
Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుంటున్నారా? అందరూ చేసే ఈ తప్పులు మీరు మాత్రం చేయొద్దు
Credit Card Loan: క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి
Travel Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లతో ప్రయోజనాలే కాదు, మీకు తెలీని సీక్రెట్స్ కూడా ఉన్నాయి
Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి
Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్ మీద మూడు రెట్ల లాభం
Tirumala Tickets News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల - పూర్తి టైమింగ్స్ ఇవే
Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
RC16: రామ్ చరణ్ 'RC16' మూవీలో కన్నడ దివంగత నటుడి సతీమణి? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు