అన్వేషించండి

Gold and Silver Investment: బంగారం, వెండి ఇప్పుడు కొంటే మంచిదేనా? చరిత్ర ఏం చెబుతుంది?

Gold and Silver Investment: లిడియా సామ్రాజ్యం నుంచి డిజిటల్ యుగం వరకు బంగారం, వెండి తమ విలువను కాపాడుకుంటూనే ఉన్నాయి. ఇవి కేవలం సంపదను పెంచడమే కాకుండా కష్ట కాలంలో రక్షణగా నిలుస్తున్నాయి. 

Gold and Silver Investment: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితి ఉండదు. మార్కెట్లు ఒడిదుడుకులకు గురైనప్పుడు ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు పెట్టుబడిదారులు ఎప్పుడూ ఒక సురక్షితమైన ఆశ్రయం కోసం వెతుకుంటారు. అటువంటి సమయాల్లో శతాబ్దాలుగా మానవజాతికి భరోసానిస్తున్న ఏకైక ఆస్తి బంగారం, వెండి. కేవలం ఆభరణాలుగానే కాకుండా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఈ విలువైన లోహాల చరిత్ర మనకు చాలా విషయాలు నేర్పుతుంది. 

విలువైన లోహ ఆధిపత్యం 

గతేడాది ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అన్ని ప్రధాన ఆస్తుల కంటే బంగారం, వెండి పైపైకి ఎగబాకాయి. 2025లో వెండి ఏకంగా 146 శాతం పెరగగా, బంగారం 64 శాతం మేర వృద్ధి సాధించింది. ఈ ఏడాదిలో కూడా కాస్త ఒడిదుడుకులు కొనసాగుతున్నా పెరుగుదల నమోదు చేశాయి. 

ప్రస్తుతం మార్కెట్ అప్‌డేట్స్ ప్రకారం, ఫిబ్రవరి 2026 బంగారం ధరలు ఊగిసలాడుతున్నా అమెరికా తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు పసిడి ప్రాముఖ్యతను పెంచుతున్నాయి. బంగారం వెండి కేవలం విలువైన లోహాలుగా మాత్రమే కాకుండా ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభాలు. వీటి చరిత్రను పరిశీలిస్తే ఏడో శతాబ్ధంలో లీడియా సామ్రాజ్యంలో మొట్టమొదటి నాణేలను ఎలెక్ట్రమ్‌తో తయారు చేశారు. వీటిని బంగారం, వెండి మిశ్రమంతో రూపొందించారు. నాటి నుంచి నేటి వరకు విశ్వసనీయతకు చిహ్నాలుగా ఉన్నాయి. 

ప్రాచీన రోమ్ సామ్రాజ్యం కూడా బంగారం, వెండి నాణేల ద్వారానే తన వాణిజ్యాన్ని క్రమబద్దీకరించుకుంది. 19వ శతాబ్ధంలో ఫ్రాన్స్‌ ప్రవేశపెట్టిన బైమెటాలిక్‌ వ్యవస్థ, కరెన్సీ విలువను బంగారం, వెండి రెండింటితో ముడిపెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక మార్గం చూపించింది. అప్పట్లో బంగారం, వెండి మధ్య నిర్ణీత మార్పిడికి రేటు ఉండటం వల్ల మార్కెట్‌ ఒడిదుడుకులను తట్టుకోవడం సులభమైంది. 

అమెరికా చరిత్రలో కూడా 1792 నాటికి కాయినేజ్ యాక్ట్ ద్వాార రెండు లోపాల ప్రామాణికతను గుర్తించారు. అయితే మార్కెట్‌ విలువలకు అనుగుణంగా వీటి రేట్లు మారుతుండటంతో 1873లో అమెరికా వెండిని వదిలి కేవలం గోల్డ్ స్టాండర్డ్‌కు మారింది. ఆ సమయంలో ఇది తీవ్ర ఆర్థిక అనిశ్చితికి దారి తీసింది. 

వెండి కరెన్సీ మాత్రమే కాదు పారిశ్రామిక అవసరం 

బంగారంతో పోలిస్తే వెండికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది. ఇది కేవలం పెట్టుబడి సాధనమే కాదు. ఒక కీలకమైన పారిశ్రామిక వస్తువు. ఎలక్ట్రానిక్స్‌ నుంచి సోలార్ ప్యానెల్స్‌ వరకు వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ ద్వంద్వ స్వభావం వల్ల వెండి ధరల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కానీ లాభాలు పొందే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణ సమయంలో వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉందని గత అనుభవాలు చెబుతున్నాయి. 

బంగారం వర్సెస్‌ వెండి

పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే... బంగారం , వెండి రెండింటికీ నిల్వ, నగదు మార్చుకునే విషయంలో తేడాలు ఉన్నాయి. బంగారం తక్కువ పరిమాణంలో ఎక్కువ విలువను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని నిల్వ చేయడం, రవాణా చేయడం సులభం. కానీ వెండి అదే విలువను ఇవ్వాలంటే ఎక్కువ బరువు, ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్‌క లోతెక్కువ. అత్యవసర సమయాల్లో కూడా గోల్డ్ తక్కువ స్ప్రెడ్స్‌తో త్వరగా అమ్ముడవుతుంది. వెండి విషయంలో భారీ మొత్తం విక్రయించేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. 

సెంట్రల్ బ్యాంకుల వ్యూహాల్లో బంగారం

నేటి ఆధునిక కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని తమ ప్రధాన రిజర్వ్ ఆస్తిగా మలుచుకుంటున్నాయి. పెరుగుతున్న ప్రపంచ అప్పులు,రాజకీయ అనిశ్చితి, కాగితపు కరెన్సీల కంటే ఫిజకల్ గోల్డ్‌పై నమ్మకం పెరుగుతోంది. 2020 కరోనా టైంలో బంగారం 25.1, వెండి 47.9 శాతం పెరగడం దీనికి నిదర్శనం. 

ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు 

మార్కెట్‌లో ప్రస్తుతం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. ఎక్స్చేంజీలు మార్జిన్ హైక్‌ చేసినప్పుడు అంటే ట్రేడింగ్ కోసం కావల్సిన నగదు పరిమితిని పెంచినప్పుడు ధరల్లో అస్థిరత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కేవలం తాత్కాలికమే అయినప్పటికీ ఫిజికల్‌ మెటల్స్‌ను కలిగి ఉండటం వల్ల ఇటువంటి ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చు. 

ప్రస్తుతం రిటైల్‌ పెట్టుబడి దారులు స్టాక్ మార్కెట్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే, ఇటువంటి విపరీతమైన ఆశావాదం మార్కెట్‌ గరిష్ట స్థాయిలకు చేరుకున్నప్పుడు కనిపిస్తుందని, అటువంటి సమయంలో పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బంగారం, వెండి సురక్షిత ఆస్తుల్లో ఉంచుకోవడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget