By: ABP Desam | Updated at : 03 Jun 2023 01:23 PM (IST)
స్టేట్ బ్యాంక్ Vs పోస్టాఫీస్ - ఏది బెస్ట్ FD?
Fixed Deposit: కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట వల్ల చాలామంది ప్రజలు షేర్ల వైపు చూడడం తగ్గించారు. తమ దగ్గరున్న డబ్బును స్టాక్ మార్కెట్‌లో కాకుండా, నమ్మకమైన &స్థిరమైన ఆదాయం వచ్చే మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అలా, రిస్క్ వద్దనుకున్న వాళ్లకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్. ప్రస్తుతం, మన దేశంలో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షించడానికి చాలా బ్యాంక్‌లు అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్లను ప్రకటించాయి. పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో కూడా మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి.
డబ్బు సంపాదన విషయంలో రిస్క్ తీసుకోకూడదు అని మీరు అనుకుంటే, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లు ఒక సేఫ్ ఛాయిస్. దేశంలోని చాలా బ్యాంక్‌లు, తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 7 శాతానికి పైగా వడ్డీని అందిస్తున్నాయి. అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 3 నుంచి 7.5 శాతం వడ్డీని (SBI Fixed Deposit Interest Rate) అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలు SBI కంటే వెనుకబడి మాత్రం లేవు. మీ డబ్బును ఎస్‌బీఐకి తీసుకెళ్లాలా, పోస్టాఫీసుకు తీసుకెళ్లాలా అన్న గందరగోళంలో ఉంటే.. ముందు ఈ విషయాలను అర్ధం చేసుకోండి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల పరిమితి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టర్మ్ డిపాజిట్ కాల పరిమితి (Fixed Deposit Maturity) 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు (Post Office Fixed Deposit Scheme) 1, 2, 3, 5 సంవత్సరాల కాలానికి మాత్రమే పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి.
వడ్డీ ఆదాయం
సాధారణ ప్రజల విషయంలో, రూ. 2 కోట్ల కంటే తక్కువున్న రిటైల్ డిపాజిట్ల మీద 3 నుంచి 7 శాతం మధ్య వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లిస్తోంది. ఇవే కాల వ్యవధుల్లో సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంక్ ప్రత్యేక పథకం అమృత్ కలశ్ కింద, పెట్టుబడిదార్లు 7.6 శాతం వరకు రాబడి పొందవచ్చు. అమృత్ కలశ్ స్కీమ్ వ్యవధి 400 రోజులు.
పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ల మీద వడ్డీ 6.8 నుంచి 7.5 శాతం మధ్య (Post Office Fixed Deposit Interest Rate) ఉంటుంది. వడ్డీని ఏటా జమ చేస్తారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రేట్లు లేవు.
పన్ను ప్రయోజనాలు
స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ రెండూ ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను ప్రయోజనాలను (Income Tax Benefits) అందిస్తున్నాయి.
కాల పరిమితికి ముందే డబ్బు ఉపసంహరణ
పోస్టాఫీసులో, కాల పరిమితికి (మెచ్యూరిటీ) ముందే ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి మెచ్యూరిటీకి ఆరు నెలల ముందే విత్‌డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసిన ఆరు నెలల తర్వాత - ఒక సంవత్సరం లోపు ఖాతాను మూసివేస్తే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ రేటును ఆ డిపాజిట్‌కు వర్తింపజేస్తారు.
SBI FDని కూడా ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను మీరు కొనసాగించిన కాలాన్ని బట్టి కొంత జరిమానాను బ్యాంక్ విధిస్తుంది.
SBI FD లేదా పోస్ట్ ఆఫీస్ FD - ఏది ఎంచుకోవాలి?
ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు రెండూ ప్రభుత్వంతో లింక్ అయిన పథకాలు. ఇవి రెండూ సురక్షితమైన పెట్టుబడి మార్గాలు, స్థిరమైన రాబడిని అందిస్తాయి. మీరు స్వల్పకాలిక డిపాజిట్‌ను ఎంచుకోవాలనుకుంటే SBI ఒక మంచి ఎంపిక. దీర్ఘకాలిక FD కోసం చూస్తున్నట్లయితే, ఒకే కాలానికి ఈ రెండు సంస్థల్లో ఇస్తున్న వడ్డీ రేటును బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Bank Locker Rules: బ్యాంక్ లాకర్లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!