By: ABP Desam | Updated at : 11 Apr 2023 01:12 PM (IST)
Edited By: Arunmali
ఉమాంగ్ యాప్‌తో పీఎఫ్ డబ్బు విత్‌డ్రా
EPFO Services on Umang App: ఉద్యోగం చేసే వ్యక్తులు తమ జీతంలో కొంత భాగాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రూపంలో పొదుపు చేస్తారు. PF ఖాతాదార్లు, EPFOలో డిపాజిట్ చేసిన మొత్తంలో తమ పదవీ విరమణ తర్వాత 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, అంతకంటే ముందే డబ్బు కోసం అత్యవసర పరిస్థితులు ఎదురైతే..?, అలాంటి పరిస్థితుల్లో కూడా భవిష్య నిధి ఖాతా నుంచి కొంత డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. అయితే, ఇలా డబ్బు తీసుకునే ముందు, మీరు దీనికి తగిన కారణం చెప్పాలి. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరం అయితే, కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు. ఉమాంగ్ యాప్ (UMANG App) ద్వారా PF ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.
PF ఖాతా నుంచి ఎలాంటి అవసరాల కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు?
సాధారణంగా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బును ఉద్యోగులు (EPFO Account Holders) ఉపసంహరించుకుంటారు. ఇంటి మరమ్మతులు, పిల్లల చదువులు, వివాహ ఖర్చులు, కుటుంబ సభ్యులకు లేదా తనకు అనారోగ్య ఖర్చులు వంటి అవసరాల కోసం PF ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు, సాంకేతికత పెరగని రోజుల్లో, పీఎఫ్ డబ్బుల కోసం బ్యాంకు లేదా PF కార్యాలయం చుట్టూ ఉద్యోగులు పర్యటనలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు, క్యాష్ విత్‌డ్రా పనిని మీరు ఇంట్లో కూర్చొనే పూర్తి చేయవచ్చు.
ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బు విత్‌డ్రా పని పూర్తి చేయవచ్చు
EPFO ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉమాంగ్ యాప్ కూడా వాటిలో ఒకటి. దీని ద్వారా, పీఎఫ్ ఖాతా నుంచి సులభంగా డబ్బు వెనక్కు తీసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బును ఉపసంహరించుకోవడానికి, ముందుగా మీ PF యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను (UAN) ఆధార్ నంబర్‌తో కచ్చితంగా లింక్ చేసి ఉండాలి. ఉమంగ్ యాప్ ద్వారా PF ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకునే సులభమైన ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి?
ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లోకి ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆ యాప్‌లో మీ వివరాలు రిజిస్టర్ చేయాలి.
యాప్‌లో మీ మొబైల్ పోన్ నంబర్‌ను నమోదు చేయాలి.
ఉమాంగ్ యాప్‌లో మీకు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి, దానిలో R ఎంపికను ఎంచుకోండి.
ఆ తర్వాత, రైజ్ క్లెయిమ్ (raise claim) ఎంచుకోవడం ద్వారా UAN నంబర్‌ను పూరించాలి.
దీని తర్వాత, EPFOలో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఇక్కడ నమోదు చేయండి.
ఇప్పుడు మీరు PF ఖాతా నుంచి విత్‌డ్రా రకాన్ని ఎంచుకుని, ఆ ఫారం పూర్తి చేయండి.
ఫారాన్ని పూర్తి చేసిన తర్వాత, మరొకసారి తనిఖీ చేసుకుని సబ్మిట్ నొక్కండి.
ఇప్పుడు, మీ FF ఖాతా నుంచి నగదు ఉపసంహరణ కోసం రిఫరెన్స్ నంబర్ మీకు వస్తుంది.
ఈ నంబర్ ద్వారా, డబ్బు ఉపసంహరణ అభ్యర్థనను మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
మీరు అభ్యర్థన పెట్టుకున్న 3 నుంచి 5 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు