Paytm IPO Listing: అయ్యయ్యో.. పేటీఎం! నష్టాల్లో లిస్టైన షేర్లు.. ఎంతంటే?
పేటీఎం ఐపీవో అనుకున్నంత హిట్టు అవ్వలేదు. 9 శాతం డిస్కౌంటుతో షేర్లు లిస్ట్ అయ్యాయి. రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువతో కంపెనీ నమోదైంది.
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం గురువారం స్టాక్ మార్కెట్లో నమోదైంది. దశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవోగా భావించిన వన్97 కమ్యూనికేషన్స్ అనుకున్నంత హిట్టవ్వలేదు! రూ.2150 ఇష్యూ ధరతో పోలిస్తే 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1,950 వద్ద మార్కెట్లో నమోదైంది. కాగా కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లుగా ఉంది.
Man, I can feel for our cricket team!
— Vijay Shekhar Sharma (@vijayshekhar) November 18, 2021
So many messages, wishes, & kind words. Feels like carrying the hopes and aspirations of young India to the Stock Market. 🙏🏼
From coal to a fintech, in 11 years — India has transformed.
To every Paytmer, you’ve changed India for good 🚀
గురువారం ఉదయం పది గంటలకు పేటీఎం లిస్టైంది. స్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అతడి కుమారుడు బీఎస్‌ఈలో లిస్టింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. 9 శాతం డిస్కౌంట్‌తో నమోదైన షేర్ల ధర ఆ తర్వాత మరింత పడిపోయింది. ఉదయం 11 గంటల సమయంలో రూ.1600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై కాస్త కోలుకొని రూ.450 నష్టంతో రూ.1700 వద్ద ట్రేడ్ అవుతోంది.
పేటీఎం మార్కెట్లో నమోదైన వెంటనే సీఈవో విజయ్ శేఖర శర్మ ట్వీట్ చేశారు. 'యువ భారత ఆశలను స్టాక్ మార్కెట్ వైపు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది' అని అన్నారు. 'మన క్రికెట్ జట్టు గురించి నేను ఫీలవుతున్నా! చాలా సందేశాలు, అభినందనలు, ప్రోత్సాహపూరిత మాటలు వస్తున్నాయి. యువ భారత ఆశలను స్టాక్ మార్కెట్ వైపు నడిపిస్తున్నట్టుగా అనిపించింది. బొగ్గు నుంచి ఫిన్‌టెక్ వరకు 11 ఏళ్లలో భారత్ ఎంతో పరివర్తన చెందింది. ప్రతి పేటీఎం యూజర్ ఇండియాను ఎంతగానో మార్చేశాడు' అని విజయ్‌శేఖర్ అన్నారు.
పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌కు 1.66 రెట్ల స్పందన లభించింది. 87 లక్షల షేర్లను వారికి కేటాయించారు. ఈక్విటీ కింద రూ.8,300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.10,000 కోట్ల షేర్లను విక్రయించారు.
Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి