Income Tax Portal Issue: ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో లోపాలు.. ఇన్ఫోసిస్ ఎండీకి కేంద్రం నోటీసులు
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో లోపాలపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. నెలలు గడుస్తున్నా టెక్నికల్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఇన్ఫోసిస్‌కు సమన్లు జారీ చేసింది.
కొత్త ఆదాయపు పన్ను చట్టం వెబ్‌సైట్‌లోని లోపాలు ఎందుకు ఇంకా సరిచేయలేదో చెప్పాలని కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ అండ్ సీఈవో సలీల్ పరేఖ్‌కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. సైట్ ప్రారంభమైనప్పటి నుంచి టెక్నికల్ లోపాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇన్‌టైంలో ఐటీఆర్ ఫైలింగ్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జూన్ 7న ప్రారంభమైన కొత్త 'www.incometax.gov.in'వెబ్‌సైట్ అనేక లోపాలతో వినియోగదారులకు చిరాకు తెప్పిస్తోంది. ఆధార్ కార్డు ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ రావడం లేదు. లాగిన్ అవడానికి కూడా చాలా సమయం తీసుకుంటోంది. పాత ఐటీఆర్ ఫైల్ కనిపించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
'www.incometax.gov.in'వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న సమస్యలతో ఇబ్బంది పడ్డ పన్నుచెల్లింపుదారులు సోషల్ మీడియా వేదికగా ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. రోజు రోజుకు ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్... సమస్యను పరిష్కరించాలని ఇన్ఫోసిస్ కంపెనీని ఆదేశించింది.
ALSO READ: కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం పోయిందా? కేంద్రం బంపర్ ఆఫర్ ఇదే!
వెబ్‌సైట్‌లోని టెక్నికల్ ఇష్యూను సరిచేసి.. యూజర్ ఫ్రెండ్లీగా రెడీ చేయాలని ఇన్ఫోసిస్‌ను నిర్మలా సీతారామన్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీలైనంత త్వరంగా సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు. ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్‌ను ఆధునీకరించేందుకు 2019లో కేంద్రంతో ఇన్ఫోసిస్ ఒప్పందం చేసుకుంది. ఫైలింగ్ ప్రాసెస్ వ్యవధి తగ్గించేలా వెబ్‌సైట్‌ను సరికొత్తగా రూపొందించాలని కేంద్రం చెప్పింది. దీనిపై వర్క్ చేసిన ఇన్ఫోసిస్ ఇప్పుడున్న వెబ్‌సైట్‌ను రూపొందించింది. వెబ్‌సైట్‌ను జూన్ ఏడవ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి తలెత్తుతున్న అనేక సాంకేతిక సమస్యలు ప్రజల సహనాన్ని పరీక్షించాయి.
ALSO READ: మహీంద్రా బొలెరో నియోలో న్యూ వేరియంట్.. కొత్త పీచర్ ఏంటంటే?
కేంద్రం పంపించిన నోటీసులు, ప్రజల నుంచి ఎదరవుతున్న ప్రశ్నలపై ఇన్ఫోసిస్ చీఫ్ ఆరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు స్పందించారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని... తమ టీం సమస్య పరిష్కారాని ట్రై చేస్తోందన్నారు. గత వారం రోజులుగా చాలా సమస్యలను పరిష్కరించామని చెప్పారు. రోజు వారి వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారాయన. పోర్టల్‌లో ఇప్పటివరకు దాదాపు లక్ష ఐటీఆర్ ఫైల్స్ సబ్‌మిట్ చేశారని ప్రవీణ్ రావు తెలియజేశారు.
ALSO READ: సెల్టోస్ అమ్మకాల్లో కియా రికార్డు.. రెండేళ్లలో 2 లక్షల విక్రయాలు..