By: ABP Desam | Updated at : 21 Aug 2021 04:59 PM (IST)
సెల్టోస్ అమ్మకాల్లో కియా రికార్డు
కార్ల అమ్మకాల్లో కియా ఇండియా సంస్థ దూసుకుపోతోంది. భారతదేశంలో సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించి రేపటికి (ఆగస్టు 22) రెండేళ్లు కావస్తోంది. రెండేళ్లలోనే మొత్తం 3 లక్షల కార్ల విక్రయాలు జరిపినట్లు కియా వెల్లడించింది. రికార్డు స్థాయిలో 2 లక్షల సెల్టోస్ (Seltos) మోడల్ కార్లను విక్రయించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కియా విక్రయిస్తున్న కార్లలో సెల్టోస్ వాటా 66 శాతానికి పైగా ఉంది. ఇవికాకుండా 1.5 లక్షల ఇంటర్నెట్ కనెక్టెడ్ కార్ల విక్రయాలు కూడా జరిపింది. ఇంటర్నెట్ కనెక్టెడ్ కార్లలో కియా వాటా 19 శాతంగా ఉంటుంది. కియా కంపెనీకి చెందిన కార్ల అసెంబ్లింగ్ యూనిట్ అనంతపురం జిల్లా పెనుగొండలో ఉంది. అక్కడి నుంచే కార్లను పంపిణీ చేస్తుంది.
టాప్ వేరియంట్ల నుంచి 58 శాతం..
సెల్టోస్ కార్ల విక్రయాలలో దాదాపు 58 శాతం టాప్ వేరియంట్ల నుంచి వచ్చినవేనని తెలుస్తోంది. సెల్టోస్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు కూడా 45 శాతం వరకు డీజిల్ పవర్ టైన్ల వైపు మొగ్గుచూపుతారని సంస్థ పేర్కొంది. సెల్టోస్ ఐఎంటీ (iMT) వేరియంట్ లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే వినియోగదారులను బాగా ఆకర్షించిందని తెలిపింది. సెల్టోస్ హెచ్‌టీఎక్స్ 1.5 పెట్రోల్ వేరియంట్ కార్లకు.. కస్టమర్లు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది.
Also Read: Volkswagen Taigun: సెప్టెంబర్‌లో వోక్స్ వేగన్ టైగన్ ఎస్‌యూవీ.. ప్రారంభమైన ప్రీ బుకింగ్స్
త్వరలో కియా సెల్టోస్ ఎక్స్ లైన్..
కియా ఇండియాలోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా త్వరలో మరో కారును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌యూవీలలో సెల్టెస్ ఎక్స్ లైన్ వెర్షెన్ తీసుకురానున్నట్లు లీకులు అందుతున్నాయి. ఇటీవల కియా ఇండియా విడుదల చేసిన టీజర్ కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. దీంతో కియా నుంచి త్వరలో లాంచ్ కాబోయే సెల్టెస్ ఎక్స్ లైన్ కార్ల ఫీచర్లపై లీకులు వస్తున్నాయి.
ఆటో ఎక్పో 2020లో ఈ ఎక్స్ లైన్ ఫస్ట్ లుక్ లీకయింది. లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌గా ఇది ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సాధారణ సెల్టోస్ కార్లతో పోలిస్తే ఇవి మరింత రగ్డ్ లుకింగ్ వెర్షన్‌గా రానున్నట్లు సమాచారం. సెల్టోస్ కార్ల ధర రూ.9.95 లక్షల నుంచి రూ.17.65 లక్షల వరకు (ఎక్స్ షోరూం ప్రకారం) ఉంది. ఎక్స్ లైన్ ధర దీని కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ కార్లు హుండాయ్ క్రిటా, రెనాల్ట్ డస్టర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. వీటితో పాటు త్వరలో విడుదల కాబోయే వోక్స్ వేగన్ టైగన్.. ఎంజీ అస్టర్ కార్లతో కూడా పోటీ పడనున్నాయి.
Also Read: Tata Tigor EV: టాటా నుంచి సూపర్ ఫీచర్స్‌తో మరో ఎలక్ట్రిక్ కారు.. అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..
Also Read: Honda Amaze Facelift: హోండా నుంచి అమేజ్ ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే?
Best Cars Under Rs 8 Lakhs: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!
Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!
TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!
Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!
New Kia Sonet Facelift: మరికొద్ది రోజుల్లో కొత్త కియా సోనెట్ - డిజైన్‌లో భారీ మార్పులు!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>