By: ABP Desam | Updated at : 16 Sep 2022 12:44 PM (IST)
Edited By: Arunmali
ఐటీ నుంచి బ్యాంకుల వైపు మారుతున్న ట్రెండ్
Stock Market News: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల మూడ్, ట్రెండ్ మారుతోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఆటో అనుబంధ రంగాలు, పెయింట్స్, స్టీల్, అల్యూమినియం నుంచి ప్రతి సెక్టార్‌కూ పని పెరుగుతోంది. ఆయా కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇందుకోసం అవసరమయ్యే డబ్బుల కోసం ఆయా పరిశ్రమలన్నీ బ్యాంకుల గడప తొక్కాల్సిందే. అంటే, ఈ పరిస్థితి నుంచి ఫైనల్‌గా లాభపడేది బ్యాంకులే. వివిధ పరిశ్రమలకు బ్యాంకులు అప్పులిచ్చి వాటి వ్యాపారాన్ని, ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. గత త్రైమాసికాలుగా బ్యాంకింగ్ ఫలితాలను గమనిస్తే, ఎప్పటికప్పుడు నంబర్లలో మంచి వృద్ధి కనిపిస్తోంది. దీనిని బట్టి, దేశ ఆర్థిక వృద్ధి నుంచి బ్యాంకులు బాగా లాభపడుతున్నాయని అర్ధం చేసుకోవచ్చు.
వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే సంపన్న పెట్టుబడిదారుల నుంచి వేల రూపాయల్లో మాత్రమే వెచ్చించగల రిటైల్ ఇన్వెస్టర్ల వరకు ఈ పరిస్థితిని ఒంట బట్టించుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో బ్యాంకుల వైపు మారిపోతున్నారు.
ఇంకో విషయం ఏంటంటే, పేలవమైన ప్రదర్శన చేస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కౌంటర్ల నుంచి ఇన్వెస్టర్లు బయటకు వచ్చేస్తున్నారు. ఇలా బయటకు తెచ్చే డబ్బులను బ్యాంకింగ్ స్టాక్స్ మీద బెట్స్‌గా మారుస్తున్నారు.
మాద్యం భయంతో అమెరికన్ నాస్‌డాక్ ఇటీవల విపరీతంగా పతనమవుతోంది. దానికి తగ్గట్లే మన ఐటీ రంగం స్టెప్పులు వేస్తోంది. అందువల్ల, మన భారత ఐటీ కంపెనీల మార్జిన్లు ఒత్తిడికి గురవుతాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు భావిస్తున్నారు. ఐటీ స్టాక్స్ డీ రేటింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ, వాటి మీద వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నారు.
ఐటీ డౌన్-బ్యాంక్ అప్
2022లో ఇప్పటివరకు (YTD) నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 28 శాతం క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ 16 శాతం లాభపడింది, గురువారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఇదే కాలంలో నిఫ్టీ50 ఇండెక్స్ 3 శాతం పెరిగింది, రికార్డు గరిష్ట స్థాయికి దాదాపు 4 శాతం దూరంలో ఉంది.
కరోనా సమయం నాటి చేదు అనుభవాల కారణంగా గత 2-3 సంవత్సరాలు చెత్త పనితీరులో ఉన్న బ్యాంకింగ్ రంగం ఇప్పుడు మంచి స్థానంలో ఉంది, ఇన్వెస్టర్ల ఆసక్తిని ఆకర్షిస్తోంది. పటిష్టమైన ఆదాయాల వృద్ధి, క్రెడిట్ వృద్ధిని పెంచుకోవడం, సమంజసమైన విలువలతో పాటు ఆస్తుల నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటివి ఈ రంగానికి సహాయపడుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Motilal Oswal Financial Services) చెబుతోంది. అమెరికన్ మాంద్య భయం, నిరంతర వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు IT రంగంలో సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయని వివరించింది.
2021లో రివర్స్ సీన్
2021లో (కరోనా ఫస్ట్ వేవ్ అనుభవంతో ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు మారుతున్న సమయం) నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 60 శాతం పెరగ్గా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 13 శాతం మాత్రమే లాభపడింది. నిఫ్టీ50 ఇండెక్స్ 24 శాతం ఎగసింది.
ఐటీ రంగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 26 శాతం క్షీణించాయి, ₹6.90 లక్షల కోట్ల నుంచి ₹5.11 లక్షల కోట్లకు దిగి వచ్చాయి. దీనికి విరుద్ధంగా, ఇదే కాలంలో ఆర్థిక సేవల రంగంలో వాళ్ల ఆస్తులు 11 శాతం పెరిగి రూ.15.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇన్వెస్టర్ల మూడ్ మారిందనడానికి ఇదే సులభమైన ఉదాహరణ.
టాప్-5 లూజర్స్, గెయినర్స్
2022లో ఇప్పటివరకు టాప్ -5 ఐటీ స్టాక్స్- టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర - 16-42 శాతం వరకు కింద పడ్డాయి. ఇదే కాలంలో టాప్ - 5 బ్యాంక్ స్టాక్స్ 3-24 శాతం లాభపడ్డాయి. ట్రెండ్ మారిందనడానికి ఇది మరో ఉదాహరణ.
ప్రస్తుతానికి ఐటీ రంగ స్టాక్స్ వెనుకబడినా, భవిష్యత్తులో మళ్లీ పుంజుకోవచ్చు. దీనికి 24 నుంచి 30 నెలల వరకు పట్టవచ్చని బ్రోకింగ్ హౌస్ షేర్‌ఖాన్ షేర్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్గా మలయాళీ భామకు ఛాన్స్