By: ABP Desam | Updated at : 29 Aug 2022 05:15 PM (IST)
Edited By: Arunmali
నష్టాల్లో స్టాక్ మార్కెట్
Stock Market Closing Bell 29 August 2022: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,350 దిగువనే ఆగిపోతే, సెన్సెక్స్ 861 పాయింట్లు కోల్పోయి క్లోజయింది. ఐటీ స్టాక్స్ మీద గట్టిగా దెబ్బపడింది.
Stock Market Closing Bell 24 August 2022: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం స్ట్రాంగ్ గ్యాప్‌డౌన్‌లో ఓపెన్ అయిన మార్కెట్లు, హెవీ వెయిట్ రిలయన్స్ షేరులో వచ్చిన కొనుగోళ్ల పుణ్యమాని కొద్దిగా కోలుకున్నాయి. నష్టాలను కొంత పూడ్చుకున్నప్పటికీ, లాభాల్లోకి రావడంలో మాత్రం విఫలమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 246 పాయింట్లు లేదా 1.40 శాతం నష్టపోగా .. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 861 పాయింట్లు కోల్పోయింది.
BSE Sensex
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇవాళ 57,367 వద్ద మొదలైంది. ఇదే దాని ఇంట్రాడే కనిష్ఠం కూడా. 57,367.47 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 861.25 పాయింట్లు లేదా 1.46 శాతం నష్టంతో 57,972.62 వద్ద ముగిసింది.
NSE Nifty
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇవాళ 17,188.65 వద్ద ఓపెనైంది. 17,166.20 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,380.15 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 246 పాయింట్లు లేదా 1.40 శాతం నష్టంతో 17,312.90 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ కూడా భారీ నష్టాల్లో లాభాల్లో క్లోజైంది. 710.45 పాయింట్లు లేదా 1.82 శాతం కోల్పోయి 38,276.70 వద్ద ముగిసింది.
Gainers and Lossers
Market Update for the day.
— NSE India (@NSEIndia) August 29, 2022
See more> https://t.co/xBwq7mn9EL https://t.co/F6ARBUOvcp #NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/vF16yEnVmO
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో ముగిస్తే, ఏకంగా 38 నష్టాల్లో ముగిశాయి. బ్రిటానియా, మారుతి, నెస్టిల్ ఇండియా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా లాభాల్లో క్లోజ్ అవగా... టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విప్రో, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్‌గా నష్టాల్లో ఆగిపోయాయి. నిప్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ కొద్దిపాటి లాభాలతో పచ్చరంగు పులుముకోగా... మిగిలిన ఇండీసెస్ అన్నీ ఎరుపు రంగులోనే ఉన్నాయి. టాప్ లూజర్ నిఫ్టీ ఐటీ. ఇది దాదాపు 3.53 శాతం పడిపోగా, నిఫ్టీ మీడియా 2 శాతం కోల్పోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy