News
News
X

M&M Q2 Results 2021: ధరలు పెరిగినా.. సెమీ కండక్టర్ల కొరత వేధించినా.. 214 శాతం లాభపడ్డ ఎం అండ్‌ ఎం

2021, సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా 214 శాతం లాభాలను నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన రూ.1,929 కోట్ల లాభం ఆర్జించింది.

FOLLOW US: 
 
సెమీ కండక్టర్ల కొరత వేధించినా, ముడి వనరుల ధర పెరిగినా రెండో త్రైమాసికంలో ఆటో మొబైల్‌, ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా రాణించింది. 2021, సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో 214 శాతం లాభాలను నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన రూ.1,929 కోట్ల లాభం ఆర్జించింది. నిర్వహణ పరమైన ప్రదర్శనతో లాభాలు నమోదు చేసింది. ఆపరేషన్స్‌ రెవెన్యూ 14.8 శాతం పెరిగి రూ.13,305 కోట్లుగా ఉంది. రూ.12,348 కోట్లుగా వేసిన అంచనాలను అధిగమించింది.

ఆటో మొబైల్‌ రంగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈ క్వార్టర్లో 99,334 వాహనాలను విక్రయించింది. 9 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ట్రాక్టర్ల విక్రయాలు మాత్రం 5 శాతం తగ్గి 88,920గా నమోదయ్యాయి. నిర్వహణ స్థాయిల్లో ఈబీఐటీడీఏ ఆదాయం 19.3 శాతం తగ్గి రూ.1,660 కోట్లుగా నమోదైంది. ముడి వనరుల ధరల పెరుగుదలతో లాభశాతం 530 బేసిస్ పాయింట్లు తగ్గింది. 

'ఆటో, వ్యవసాయ వ్యాపారాల లాభశాతంపై ధరల ప్రభావం కనిపించింది. మేం వ్యయ నియంత్రణ, వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టడంతో ఆ ప్రభావాన్ని బాగా తగ్గించాం' అని గ్రూప్‌ సీఎఫ్‌వో మనోజ్‌ భట్‌ తెలిపారు.

'ఆటోమోటివ్‌ సెగ్మెంట్లో మాకు మంచి డిమాండ్‌ ఉంది. బుకింగ్స్‌ బాగున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ల కొరత.. ఉత్పత్తి, అమ్మకాలపై ప్రభావం చూపించింది. ఇక ఫామ్‌ బిజినెస్‌లో క్యూ2లో అత్యధిక పీబీఐటీ నమోదు చేశాం. మార్కెట్‌ వాటాలో 1.9 శాతం వృద్ధి నమోదైంది' అని ఎం అండ్‌ ఎం తెలిపింది. మంగళవారం కంపెనీ షేరు ధర రూ.892 వద్ద ముగిసింది. 3.8 శాతం అంటే రూ.32.65 లాభపడింది.

News Reels

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Nov 2021 04:17 PM (IST) Tags: Mahindra and Mahindra M&M Q2 results 2021 Profit

సంబంధిత కథనాలు

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

FD interest rate: రెండేళ్ల ఎఫ్‌డీ - పోస్టాఫీస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో ఎక్కువ వడ్డీ ఇచ్చేదెవరు?

FD interest rate: రెండేళ్ల ఎఫ్‌డీ - పోస్టాఫీస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో ఎక్కువ వడ్డీ ఇచ్చేదెవరు?

Cryptocurrency Prices: ఫ్లాట్‌గా క్రిప్టో ట్రేడింగ్‌! రూ.5 వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: ఫ్లాట్‌గా క్రిప్టో ట్రేడింగ్‌! రూ.5 వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ