అన్వేషించండి

Latest Gold-Silver Price Today 18 May 2023: పడుతూనే ఉన్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

Latest Gold-Silver Price 18 May 2023: అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన యూఎస్‌ ఫెడ్‌, వడ్డీ రేట్ల పెంపు చక్రాన్ని కొనసాగిస్తుందన్న అంచనాలతో డాలర్‌ బలపడుతోంది. గోల్డ్‌ బలహీనపడుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,982 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర ₹ 200 , స్వచ్ఛమైన పసిడి ధర ₹ 220 చొప్పున దిగి వచ్చాయి. కిలో వెండి ధర ₹ 100 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 56,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,200 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 56,100 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 61,200 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 78,100 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 56,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,640 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 56,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,200 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,350 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,200 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,250 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,200 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 130 పెరిగి ₹ 28,300 వద్ద ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది. ఫలితంగా ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

ఇది కూడా చదవండి: గంటకు 325 స్పీడ్‌తో వెళ్లే కారు - ఇండియాలో డెలివరీ చేసిన లాంబోర్గినీ - ధర ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget