search
×

IPO: టాటా టెక్నాలజీస్ ఐపీవో షేర్‌ ధర, గ్రే మార్కెట్‌ ట్రెండ్‌ ఎలా ఉందో తెలుసుకోండి

ఈ కంపెనీ ప్రమోటర్ ఎంటిటీ అయిన టాటా మోటార్స్ సహా ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు షేర్‌హోల్డర్లు వాళ్ల వాటాలను అమ్మకానికి పెట్టబోతున్నారు.

FOLLOW US: 
Share:

Tata Technologies IPO: 18 సంవత్సరాల తర్వాత, టాటా గ్రూప్‌ నుంచి ఒక కంపెనీ ఐపీవో స్టాక్ మార్కెట్‌లోకి రానుంది. ఆ కంపెనీ టాటా టెక్నాలజీస్. త్వరలోనే IPO సబ్‌స్క్రిప్షన్స్‌ను ఇది ప్రారంభించనుంది. టాటా గ్రూప్‌ నుంచి చివరిసారిగా IPOకు వచ్చిన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). 2004లో ఇది ఐపీఓకి వచ్చింది.

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి, ఈ ఏడాది మార్చి నెలలో ఐపీవో పేపర్లను టాటా టెక్నాలజీస్‌ సమర్పించింది. ప్రస్తుతం రెగ్యులేటర్ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. టాటా టెక్నాలజీస్‌ IPO పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూట్‌లో జరుగుతుంది, ఒక్క ఫ్రెష్‌ షేర్‌ను కూడా జారీ చేయడం లేదు. 

IPOలో 23.60% వాటా అమ్మకం
ఈ కంపెనీ ప్రమోటర్ ఎంటిటీ అయిన టాటా మోటార్స్ సహా ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు షేర్‌హోల్డర్లు వాళ్ల వాటాలను అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ IPO ద్వారా 9,57,08,984 ఈక్విటీ షేర్లను OFS ద్వారా అమ్ముతున్నారు, మొత్తం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 23.60%కు సమానం.

టాటా టెక్నాలజీస్‌లో ఉన్న ప్రస్తుత పెట్టుబడిదార్లు ఆల్ఫా TC హోల్డింగ్స్ Pte, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-I. ద్వారా అందించబడుతున్న ఆఫర్ ఫర్ సేల్. ప్రమోటర్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌కు ప్రస్తుతం ఈ కంపెనీలో 74.69 శాతం వాటా ఉండగా, ఆల్ఫా TC హోల్డింగ్స్ Pteకి 7.26 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-Iకు 3.63 శాతం వాటా ఉన్నాయి.

IPO ఇష్యూ ధర ఎంత ఉండొచ్చు?
టాటా టెక్నాలజీస్ ఐపీఓలో షేరు ధర ఎంత ఉంటుందనే దానిపై నిపుణులు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సైయంట్‌కు ఇచ్చిన పోర్షన్‌లో 10 శాతం తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే, ఐపీవోలో ఒక్కో షేరును రూ. 268 ధర వద్ద జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఈ ధర ఆధారంగా, టాటా టెక్నాలజీస్ మార్కెట్ విలువ రూ. 10,825 కోట్లుగా ఉంటుంది.

టాటా టెక్నాలజీస్ GMP
గ్రే మార్కెట్‌లో లేదా అనధికార మార్కెట్‌లో టాటా టెక్నాలజీస్ షేర్‌ ధర దాదాపు రూ. 850 స్థాయి ఉందని ప్రైమరీ మార్కెట్‌పై కన్నేసి ఉంచే ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. IPOలో, ఒకవేళ, ఒక్కో టాటా టెక్నాలజీస్ షేరును రూ. 268 ధరను విడుదల చేస్తే, దాని GMP ప్రతి షేరుకు రూ. 582 (850-268 = రూ. 582) అవుతుంది.

త్వరలో ప్రైమరీ మార్కెట్‌లోకి రానున్న టాటా టెక్నాలజీస్ IPO, తన పెట్టుబడిదార్లకు మల్టీబ్యాగర్ రాబడిని ఇవ్వగలదని గ్రే మార్కెట్ సూచిస్తోంది. ప్రస్తుత GMP ఆధారంగా టాటా టెక్నాలజీస్ IPO ధర కంటే గ్రే మార్కెట్‌ ప్రీమియం 200% ఎక్కువగా ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 06 May 2023 01:18 PM (IST) Tags: IPO tata group Tata Technologies SEBI

ఇవి కూడా చూడండి

IPOs: 75 ఐపీవోలు, రూ.62,000 కోట్లు - ప్రైమరీ మార్కెట్‌ సూపర్‌హిట్‌

IPOs: 75 ఐపీవోలు, రూ.62,000 కోట్లు - ప్రైమరీ మార్కెట్‌ సూపర్‌హిట్‌

Year Ender 2023: సంచలనం సృష్టించిన టాప్‌-10 IPOలు, పెట్టుబడిదార్లకు కనక వర్షం

Year Ender 2023: సంచలనం సృష్టించిన టాప్‌-10 IPOలు, పెట్టుబడిదార్లకు కనక వర్షం

Tata Technologies IPO: టాటా టెక్‌ IPO ధరల వివరాలు వచ్చేశాయ్,మినిమమ్‌ ఇంత ఇన్వెస్ట్ చేయాలని కండీషన్

Tata Technologies IPO: టాటా టెక్‌ IPO ధరల వివరాలు వచ్చేశాయ్,మినిమమ్‌ ఇంత ఇన్వెస్ట్ చేయాలని కండీషన్

IPO: టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్ ఐపీవో - ఎక్స్‌పర్ట్‌లు బిడ్‌ వేయమంటున్నారా, వద్దంటున్నారా?

IPO: టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్ ఐపీవో - ఎక్స్‌పర్ట్‌లు బిడ్‌ వేయమంటున్నారా, వద్దంటున్నారా?

IPOs: ఈ నెలలో నాలుగు పబ్లిక్‌ ఆఫర్స్‌ రె'ఢీ' - బరిలో దిగుతున్న టాటా, టీవీఎస్‌ గ్రూపులు

IPOs: ఈ నెలలో నాలుగు పబ్లిక్‌ ఆఫర్స్‌ రె'ఢీ' - బరిలో దిగుతున్న టాటా, టీవీఎస్‌ గ్రూపులు

టాప్ స్టోరీస్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!

Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్

Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్

Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు

Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు