![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Stock Market Crash: మండే మార్కెట్లు- యుద్ధం, మాంద్యం భయంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ తీవ్ర అలజడి రేగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఒత్తిడికి లోనైనా స్టాక్స్ భారీగా పతనమయ్యాయి.
![Stock Market Crash: మండే మార్కెట్లు- యుద్ధం, మాంద్యం భయంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం Indian stock market crash bse sensex down more then 2300 points below 78600 and nifty open at 24300 level Stock Market Crash: మండే మార్కెట్లు- యుద్ధం, మాంద్యం భయంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/05/7c3946aa0ce15368a3b8eb5c6c1259ce1722831720215215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Crash: మూడోప్రపంచ యుద్ధ భయం, ముంచుకొస్తున్న మాంద్యం అంచనాలతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సోమావరం స్టాక్ మార్కెట్లు ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు నుంచే తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్లు కోల్పోయి 80 వేలకు దిగువన ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ కూడా ఆదే దారిలో కొనసాగింది. దాదాపు ఐదు వందల పాయింట్లు కోల్పోయింది. 25వేల లోపు ట్రేట్ అయింది.
సెన్సెక్స్-30 సూచీలో సన్ ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ అంటే ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటన్, ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు పతనమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్‌లో కూడా అలజడి రేగింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్ పతనం దేశీయ స్టాక్ మార్కెట్‌ను కుదేలు చేసింది. మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. శుక్రవారం వాల్ స్ట్రీట్‌లోని ప్రధాన అమెరికన్ సూచీలలో సుమారు రెండున్నర శాతం క్షీణత నమోదైంది. అమెరికా స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 610.71 పాయింట్లు లేదా 1.51 శాతం క్షీణించి 39,737.26 పాయింట్ల వద్ద ముగిసింది. S&P 500 1.84 శాతం క్షీణించింది. టెక్ స్టాక్ ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్ కాంపోజిట్ 2.43 శాతం పడిపోయి 16,776.16 పాయింట్ల వద్ద ముగిసింది.
యుద్ధం - ఆర్థిక మాంధ్యం
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యవైపు అడుగులు వేస్తోందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లను కుదిపేసింది. జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి గ్లోబల్ మార్కెట్లలో ఇదే పరిస్థితి ఉంది. ఆ ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా పడింది. దీంతో ప్రారంభంతోనే స్టాక్ మార్కెట్లు 6 శాతం వరకు పడిపోయాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం కూడా మార్కెట్లను శాసించాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ కలుదువ్వుతుండగా... కొన్ని దేశాలు చేసిన మధ్యవర్తిత్వం పని చేయలేదు. దీంతో యుద్ధం ఖాయమనే సంకేతాలు బలంగా ఉన్న వేళ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
ఇండియాలో పెట్టుబడులపై అనుమానం
ఇండియా నుంచి ఎప్‌పీఐ అవుట్‌ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుందనే అంచనాలు ఈ భయానికి మరింత ఆజ్యం పోసింది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా జులైలో కొనసాగిన మార్కెట్ ఆగస్టు మొదట్లోనే తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. గత 12 నెలల నుంచి MSCI ఇండియా ఇండెక్స్, MSCI EM ఇండెక్స్ పెరుగుదలలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. MSCI ఇండియా ఇండెక్స్ 37 శాతం పెరుగుదల నమోదు చేస్తే MSCI EM ఇండెక్స్ 4 శాతం మాత్రమే పెరిగింది. ఇది కూడా మార్కెట్ ఆందోళనలకు ఓ కారణంగా చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు.
మార్కెట్లను కుప్పకూల్చిన ఐదు అంశాలు
ఇలా బలహీన ఆసియా మార్కెట్లు, యుఎస్‌లో మాంద్యం భయాలు, పొలిటికల్ అస్థిరత, దేశీయ మార్కెట్ వాల్యుయేషన్‌పై అనుమానం, ఎఫ్‌పిఐ అవుట్‌ఫ్లో మార్కెట్ ను పూర్తిగా ముంచేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)