Oxfam Report: కరోనా టైమ్: కోటీశ్వరులు 102 నుంచి 142కు! తగ్గిన 84% మంది ఆదాయం
కరోనా వైరస్ చాలామంది పేదరికంలోకి నెట్టేసింది. అసమానతను పెంచింది. 2021లో సంపన్నుల సంఖ్య 102 నుంచి 142కు పెరిగింది. అదే సమయంలో 84 శాతం కుటుంబాల ఆదాయం పడిపోయింది.
కరోనా వైరస్ మహమ్మారి పేదలను మరింత పేదలుగా కోటీశ్వరులను మరింత సంపన్నులుగా మార్చేసింది! ఎందుకంటే దేశంలో 2021లో సంపన్నుల సంఖ్య 102 నుంచి 142కు పెరిగింది. అదే సమయంలో 84 శాతం కుటుంబాల ఆదాయం పడిపోయింది. పైగా వారిలో చాలా కుటుంబాలు తమ సొంతవాళ్లను కోల్పోయాయని ఆక్స్‌ఫామ్ ఇండియా తాజా నివేదిక 'చంపేస్తోన్న అసమాన' పేర్కొంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగడానికి ముందే ఈ నివేదిక రావడం గమనార్హం.
2021లో భారత్‌లోని అత్యంత సంపన్నులైన వందమంది మొత్తం సంపద రికార్డు స్థాయిలో రూ.57.3 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 2020, మార్చిలో రూ.23.14 లక్షల కోట్లుగా ఉన్న కోటీశ్వరుల సంపద 2021, నవంబర్ 30 నాటికి రూ.53.16 లక్షల కోట్లకు పెరిగింది. ఇక 4.6 కోట్లకు పైగా భారతీయులు 2020లో అత్యంత పేదరికంలోకి జారుకున్నారు. సంపదలోని ఈ అసమానత పేదల కన్నా కోటీశ్వరులకు ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంటోంది.
భారత్‌లోని సంపన్నులపై ఒక శాతం సర్‌ఛార్జి విధించే డబ్బుతో దేశంలోని పది శాతం మందిని పేదరికం నుంచి బయటపడేయొచ్చని నివేదిక చెబుతోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్యం, మాతృత్వ సెలవులు, చెల్లింపు సెలవులు, ఫించన్ల వంటి సామాజిక భద్రత పథకాలు చేపట్టొచ్చొని సూచిస్తోంది.
'మన ఆర్థిక వ్యవస్థ ఎంత అసమానతతో ఉందో అసమానత చంపేస్తోంది నివేదిక ప్రతిబింబిస్తోంది. దేశం సమానంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడాలని మేం కోరుతున్నాం. మహమ్మారి వల్ల లింగబేధం 99 ఏళ్ల నుంచి 135 ఏళ్లకు చేరుకుంది. 2020లో మహిళలు అంతా కలిపి రూ.59.11 లక్షల కోట్ల రాబడిని కోల్పోయారు. 2019తో పోలిస్తే 1.3 కోట్ల మంది మహిళా ఉద్యోగులు తగ్గిపోయారు. సంపన్నులపై పన్నులు విధించి అసమానతను రూపుమాపడం అవసరం. ప్రాణాలు నిలబెట్టేలా ఆర్థిక వ్యవస్థను మార్చాలి. భారత సంపదను పంచగలదని ప్రపంచానికి చూపించాలి' అని ఆక్స్‌ఫామ్ సీఈవో అమితాభ్ బెహర్ అన్నారు.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!