Income Tax Saving Documents: పన్ను ఆదా చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి, త్వరగా సేకరించండి!
ఒకవేళ పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తే ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది అన్నది ఆ పత్రాల ఆధారంగానే నిర్ణయిస్తారు.
![Income Tax Saving Documents: పన్ను ఆదా చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి, త్వరగా సేకరించండి! Income Tax Saving Proof documents-you need to submit itr online Income Tax Saving Documents: పన్ను ఆదా చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి, త్వరగా సేకరించండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/27464198dcd5e9bdbca4af35e32bb2cb1672815858298545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Income Tax Saving Documents: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి 3 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను డిక్లరేషన్ కోసం, పన్ను ఆదా పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు తెచ్చి ఇవ్వమని అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను అడగడం ప్రారంభించాయి. ఒకవేళ మీరు ఏదైనా మార్గంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, పన్ను భారం తగ్గించుకోవడానికి ఆయా పెట్టుబడులకు సంబంధించిన ధృవపత్రాలను వెంటనే కంపెనీకి సమర్పించండి. ఒకవేళ మీ దగ్గర అలాంటి పత్రాలు ఇప్పటి వరకు లేకపోతే, వాటిని సేకరించే పనిని వెంటనే ప్రారంభించండి.
మీరు పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తారా, లేదా?; ఒకవేళ పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తే ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది అన్నది ఆ పత్రాల ఆధారంగానే నిర్ణయిస్తారు.
పన్ను ఆదా చేయడానికి మీ కార్యాలయంలో సమర్పించాల్సిన పత్రాలు:
ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద, పన్ను చెల్లింపుదారులు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా చేసుకోవచ్చు. యులిప్, లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్, మ్యూచువల్ ఫండ్, ELSS, PPF, సుకన్య సమృద్ధి యోజన, 5 సంవత్సరాల పన్ను ఆదా పథకం, EPF, NPSలో ఈ పెట్టుబడులు చేయవచ్చు. ఇది కాకుండా, 80C కింద, ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, గృహ రుణాల మీద కూడా పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.
మీరు ఈ పథకాలలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే... వార్షిక పెట్టుబడి స్టేట్‌మెంట్ ఇవ్వమని మీ బీమా కంపెనీని, మ్యూచువల్ ఫండ్ కంపెనీని అడగండి. మీరు ఎడ్యుకేషన్ ఫీజు లేదా హోమ్ లోన్ ద్వారా పన్ను మినహాయింపు పొందాలనుకుంటే, వెంటనే ఈ ఖర్చులకు సంబంధించిన పత్రాలను సేకరించండి. సకాలంలో వీటిని మీ కార్యాలయంలో సమర్పిస్తేనే, మీకు ఉపయోగం ఉంటుంది.
గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు
గృహ రుణం విషయంలో... రూ. 2 లక్షల వరకు వడ్డీ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, మీరు మీ ఆదాయం నుంచి రూ. 2 లక్షల వరకు గృహ రుణ వడ్డీని తీసివేయవచ్చు. కానీ మీరు మీ టాక్స్ డిక్లరేషన్ ఫామ్‌లో ప్రకటించి, దృవీకరణ పత్రాలను సమర్పించినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ధృవీకరణ పత్రం కోసం, మీరు మీ బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాలి. అందులో, ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వడ్డీ చెల్లించినట్లు రాసి ఉంటుంది. మీరు వడ్డీ రూపంలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ చెల్లించినా, రూ. 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ప్రయోజనం పొందుతారు.
HRA క్లెయిమ్ కోసం పాన్ కార్డ్ అవసరం
HRA అంటే హౌస్ రెంట్ అలవెన్స్. మీ జీతంలో హెచ్‌ఆర్‌ఏ రూపంలో స్వీకరించిన మొత్తం మీద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే, ఇంటి యజమానితో చేసుకున్న అద్దె ఒప్పందం లేదా అద్దె చెల్లింపు రసీదులను మీ కంపెనీకి సమర్పించాలి. మీ వార్షిక అద్దె రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే, మీ ఇంటి యజమాని పాన్ నంబర్‌ను తప్పనిసరిగా సమర్పించాలి.
మెడికల్ క్లెయిమ్‌కు సంబంధించిన పత్రాలు
ప్రతి సంవత్సరం రూ. 25,000 వరకు వైద్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. మీరు మెడికల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకున్నట్లయితే, రూ. 25,000 వార్షిక ప్రీమియం వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కోసం మీ ఆరోగ్య బీమా కంపెనీ నుంచి ప్రీమియం చెల్లింపు స్టేట్‌మెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానిని మీ కంపెనీలో జమ చేయాలి.
ఈ పత్రాల ఆధారంగా, మీ పన్ను బాధ్యత (చెల్లించాల్సిన ఆదాయ పన్ను) నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత, మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను (ITR Filing) దాఖలు చేయడానికి మీ కంపెనీ ఫారం-16Aని (Form 16A) మీకు జారీ చేస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)