ITR 2024: కొత్త పన్ను విధానంలోనూ 6 మినహాయింపులు - టాక్స్ భారం తగ్గుతుంది, డబ్బు మిగులుతుంది
IT Return Filing 2024: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80CCCD(2) ప్రకారం, ఉద్యోగి NPS ఖాతాకు కంపెనీ యాజమాని కాంట్రిబ్యూషన్ సహా మరికొన్ని మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు.
Income Tax Return Filing 2024: ఐటీ రిటర్న్ ఫైలింగ్ కోసం కొత్త పన్ను విధానం (New Tax Regime) ఇప్పుడు డిఫాల్ట్‌గా మారింది. ఎక్కువ పన్ను మినహాయింపులు పొందాలకునే టాక్స్‌పేయర్లు పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకోవాలి.
కొత్త పన్ను విధానాన్ని 2020 బడ్జెట్‌లో లాంచ్ చేశారు. దీని ద్వారా ఆదాయ పన్ను స్లాబ్‌లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, పాత పన్ను విధానంతో పోలిస్తే ఎక్కువ రాయితీ రేట్లను కూడా అందించింది. కొత్త పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపులు ఉండవు అనే షరతుతో తక్కువ పన్ను రేట్లను తీసుకొచ్చింది. అయితే, కొత్త పన్ను విధానంలో కూడా పన్ను చెల్లింపుదార్లు (Taxpayers) పొందగలిగే కొన్ని మినహాయింపులు మిగిలే ఉన్నాయి.
కొత్త పన్ను విధానంలో పొందగలిగే తగ్గింపులు (Tax Deductions in New Tax Regime):
1. స్టాండర్డ్ డిడక్షన్: కొత్త పన్ను విధానంలో, పన్ను చెల్లింపుదారు జీతంపై రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవచ్చు.
2. NPS: ఉద్యోగి NPS అకౌంట్‌కు యజమాని కాంట్రిబ్యూట్ చేసిన మొత్తాన్ని సెక్షన్ 80CCCD(2) కింద డిడక్షన్ కోసం క్లెయిమ్ చేయవచ్చు.
కొత్త పన్ను విధానంలో పొందగలిగే మినహాయింపులు (Tax Exemptions in New Tax Regime):
1. దివ్యాంగులకు కంపెనీ చెల్లించిన రవాణా భత్యం (Transport allowance)
2. ఉద్యోగ నిర్వహణ కోసం ఉద్యోగి పొందిన రవాణా భత్యం
3. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చేసే పర్యటనల కోసం లేదా ఉద్యోగిని బదిలీ చేసినప్పుడు ప్రయాణ ఖర్చుల కోసం యాజమాన్యం ఇచ్చిన పరిహారం
4. సాధారణ ఖర్చులు లేదా సంస్థ తరపున వేరే ప్రాంతంలో విధి నిర్వహణ ఖర్చుల కోసం యాజమాన్యం నుంచి స్వీకరించిన రోజువారీ భత్యం (Daily allowance)
5. అధికారిక పనులపై అందుకున్న ప్రోత్సాహకాలు
6. సెక్షన్ 10(10C) కింద స్వచ్ఛంద పదవి విరమణ ద్వారా అందుకున్న డబ్బు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ, సెక్షన్ 10(10AA) కింద లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
కొత్త పన్ను విధానానికి "వర్తించని" మినహాయింపులు (Exemptions "Not Applicable" To New Tax Regime):
1. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA)
2. సెక్షన్ 80TTA లేదా సెక్షన్ 80TTB కింద డిడక్షన్
3. సెక్షన్ 16(iii) కింద ఎంప్లాయ్‌మెంట్/ ప్రొఫెషనల్ టాక్స్
4. సెక్షన్ 10(13A) కింద ఇంటి అద్దె భత్యం (HRA)
5. సెక్షన్ 17(2) (viii) కింద ఓచర్‌లు/ఫుడ్ కూపన్‌లు
6. సెక్షన్ 80C, 80CCC, 80DD పరిధిలోని పెట్టుబడులపై చాప్టర్ VIA కింద రూ. 1.5 లక్షల వరకు తగ్గింపులు
7. సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు పెట్టుబడులు
8. సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం
9. గృహ రుణంపై వడ్డీ మొత్తం
ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా మదింపు సంవత్సరం 2024-25 కోసం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31, 2024. ఈ గడువు దగ్గర పడుతోంది.
మరో ఆసక్తికర కథనం: ప్రావిడెంట్ ఫండ్ గురించి కొత్త బడ్జెట్‌లో కీలక ప్రకటన? నిర్మలమ్మ ఏం చెబుతారు?