By: ABP Desam | Updated at : 23 Mar 2022 12:36 PM (IST)
హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్
Income Tax Raids on Hero Moto Corp Residence of Pawan Munjal: హీరో మోటోకార్ప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్‌కు ఐటీ శాఖ షాకచ్చింది. ఆయన నివాసం, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గురుగ్రామ్‌లోని పవన్ ముంజల్ నివాసంలో బుధవారం ఉదయం నుంచి ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనతో సంస్థలో పనిచేసే ఉన్నతోద్యోగుల ఇళ్లు, ఆస్తులపై ఐటీ శాఖ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.
పన్ను ఎగ్గొట్టారని ఆరోపణలు..
ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే (Hero Moto Corp suspected tax evasion) ఆరోపణలతో హీరో కంపెనీ అధినేత, వ్యాపారవేత్త పవన్ ముంజల్ ఇళ్లు, ఆస్తులపై ఐటీ నిఘా పెట్టింది. గురుగ్రామ్, హరియానా, ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాల్లో ఆయనకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. పవన్ ముంజల్ సారథ్యంలో దూసుకెళ్తోన్న హీరో మోటాకార్ప్ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాలలో మొత్తం 40 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 8 కేంద్రాల్లో మ్యానుఫాక్టరింగ్ జరుగుతోంది. అందులో భారత్‌లో 6 కేంద్రాలుండగా, బంగ్లాదేశ్, కొలంబియాలలో ఒక్కో చోట హీరో కంపెనీ ఉత్పత్తులు కొనసాగిస్తోంది. దేశంలో తయారయ్యే బైక్స్, టూ వీలర్ మార్కెట్‌లో 50 శాతం వాటా ఉత్పత్తితో భారత్‌లో అగ్ర స్థానంలో దూసుకెళ్తోంది హీరో కంపెనీ. ఈ క్రమంలో నేటి ఉదయం నుంచి పలు చోట్ల హీరో కంపెనీ అధినేత పవన్ ముంజల్ ఆస్తులతో పాటు కంపెనీలో పనిచేసే ఉన్నతోద్యోగుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేస్తోంది.
Income Tax department conducting searches at multiple premises of Hero Motocorp. The office and residence of promoter Pawan Munjal and premises linked to the top officials of the company are covered in this search. More details awaited: Sources
— ANI (@ANI) March 23, 2022
29 శాతం పతనం..
ఫిబ్రవరి నెలలో హీరో మోటో కార్ప్ విక్రయాలు 29 శాతం పతనమయ్యాయి. ఆటోమోబైల్ కంపెనీ 3,58,254 యూనిట్లను విక్రయించింది. కానీ గత ఏడాది ఫిబ్రవరి నెలలో 5,05,467 మేర విక్రయాలు జరగాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 3,31,462 యూనిట్ల విక్రయాలతో 31.57 శాతం అమ్మకాలు తగ్గగా.. 2021 ఫిబ్రవరిలో భారత్‌లో 4,84,433 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
Also Read: Stock Market Today: ఈక్విటీ మార్కెట్లలో కనిపించని జోష్! ఫ్లాట్‌గా సెన్సెక్స్, నిఫ్టీ
Also Read: Gold-Silver Price: మళ్లీ 52 వేలు దాటిన బంగారం ధర, నేడు మళ్లీ పెరుగుదల - వెండి కూడా అదే దారిలో
Bike Insurance Benefits: బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market News: వరుసగా రెండో వీకెండ్ లాభాలే లాభాలు! సెన్సెక్స్ 632+, నిఫ్టీ 182+
Radhakishan Damani: స్టాక్ మార్కెట్ పతనం - డీమార్ట్ ఓనర్‌కు రూ.50వేల కోట్ల నష్టం!
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!