ICICI Bank: చరిత్ర సృష్టించిన ఐసీఐసీఐ బ్యాంక్ - భారతదేశంలో కేవలం ఆరో కంపెనీ
ICICI Bank Market Cap: ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు గత కొన్ని నెలలుగా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే 20 శాతానికి పైగా పెరిగాయి, పెట్టుబడిదార్లకు ఆకర్షణీయమైన లాభాలు పంచాయి.
ICICI Bank Market Value: ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం (25 జూన్ 2024) కొత్త చరిత్ర సృష్టించింది, 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగు పెట్టింది. జూన్ 25న బ్యాంక్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు (రూ. 8.42 లక్షల కోట్లు) దాటింది. దీంతో 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ సాధించిన ఆరో కంపెనీగా అవతరించింది.
కొత్త గరిష్టాన్ని తాకిన ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు
కొన్నాళ్లుగా జోరు మీదున్న ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు మంగళవారం కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేశాయి. ట్రేడింగ్ సమయంలో సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయిని (రూ. 1207) చేరాయి. ఈ జంప్‌తో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ (ICICI Bank Market Cap) రూ. 8.47 లక్షల కోట్లకు లేదా 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
100 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలు
మన దేశంలో, ఐసీఐసీఐ బ్యాంక్ కంటే ముందు కేవలం మరో 5 కంపెనీలు మాత్రమే 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో (Indian companies with 100 billion market cap) చోటు దక్కించుకున్నాయి. అవి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services - TCS), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel).
రిలయన్స్ ఇండస్ట్రీస్ ------ 235.98 బిలియన్ డాలర్లు
టీసీఎస్ ------ 166.54 బిలియన్ డాలర్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ------ 163.70 బిలియన్ డాలర్లు
భారతి ఎయిర్‌టెల్ ------ 101.35 బిలియన్ డాలర్లు
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ ------ 100.55 బిలియన్ డాలర్లు
2021 సంవత్సరంలో ఈ క్లబ్‌లో చేరిన ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 80 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. మొత్తం 6 కంపెనీలు ఈ స్థాయిని అధిగమిస్తే, ప్రస్తుతం 5 మాత్రమే ఈ క్లబ్‌లో కనిపిస్తున్నాయి.
ఈ 5 సంస్థలు కాకుండా, 50 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ (Indian companies with 50 billion market cap) దాటిన కంపెనీలు మరో 7 ఉన్నాయి. అవి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ------ 90.14 బిలియన్ డాలర్లు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Life Insurance Corporation of India - LIC) ------ 76.43 బిలియన్ డాలర్లు
ఇన్ఫోసిస్ (Infosys) ------ 76.11 బిలియన్ డాలర్లు
హిందుస్థాన్ యూనిలీవర్ (Hindustan Unilever) ------ 68.53 బిలియన్ డాలర్లు
ఐటీసీ (ITC) ------ 63.37
లార్సెస్ అండ్ టూబ్రో (Larsen & Toubro - L&T) ------ 59.15 బిలియన్ డాలర్లు
బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) ------ 52.43 బిలియన్ డాలర్లు
మంగళవారం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు (ICICI Bank Share Price Today) 2.90% లాభంతో రూ. 1,204 వద్ద ఆగాయి. సోమవారం నాటి ముగింపు రూ. 1170 తో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ.
ICICI బ్యాంక్ స్టాక్ గత 12 నెలల్లో (ఒక సంవత్సరంలో) సుమారు 30 శాతం రాబడిని ఇచ్చింది. 2024లో ఇప్పటి వరకు (YTD) 20 శాతానికి పైగా పెరిగింది. గత వారం రోజుల్లోనే బ్యాంకు షేర్లు దాదాపు 7 శాతం మేర పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తిర కథనం: అదానీ గ్రూప్ సంస్థల విలీనం? - ఒకే బ్యానర్ కిందకు 4 కంపెనీలు!