ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉందా ? మినిమమ్ బ్యాలెన్స్ 50వేలు చేశారు ! ఇప్పుడేం చేయాలంటే ?
Minimum balance Rs 50000: ఐసీఐసీఐ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మొత్తాన్ని 50వేలు చేశారు. అంత కంటే తక్కువ ఉంటే చార్జీలు వసూలు చేస్తారు.

ICICI Bank hikes minimum balance to Rs 50000: ICICI బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్‌ల కోసం మినిమమ్ అవరేజ్ బ్యాలెన్స్ (MAB) నిల్వ మొత్తాన్ని పెంచింది. అంటే అకౌంట్‌లో యాభై వేలు లేకపోతే చార్జీలు విధిస్తారు. అయితే బ్యాంక్ ఇక్కడ కొంత రిలీఫ్ ఇచ్చింది. ఈ మార్పులు ఆగస్టు 2025 నుండి కొత్తగా తెరిచే అకౌంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ నిబంధన వర్తించదు. ఈ మార్పులు బ్రాంచ్ లొకేషన్ ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి.
ఆగస్టు 2025 నుండి కొత్త సేవింగ్స్ అకౌంట్‌లకు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. మెట్రో , అర్బన్ ఏరియాల్లో మినిమమ్ అవరేజ్ బ్యాలెన్స్ రూ.10,000 నుండి రూ.50,000కు పెంచారు. సెమీ-అర్బన్ బ్రాంచ్‌లలో మినిమమ్ అవరేజ్ బ్యాలెన్స్ రూ.5,000 నుండి రూ.25,000కు పెంచారు. రూరల్ బ్రాంచ్‌లలో రూ.5,000 నుండి రూ.10,000కు పెంచారు.అంటే ఇప్పుడు అకౌంట్ తెరవాలంటే ఖచ్చితంగా యాభై వేలు డిపాజిట్ చేయాలన్నమాట. మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే సేవింగ్స్ అకౌంట్‌లో నిర్వహించాల్సిన అతి తక్కువ మొత్తం, ఇది పెనాల్టీలను నివారించడానికి అవసరం.
కస్టమర్లు సవరించిన MABను నిర్వహించకపోతే అవసరమైన MABలో లోటుకు 6 శాతం లేదా రూ.500, ఏది తక్కువైతే అది వసూలు చేస్తారు. పాత పెనాల్టీ: రూ.450 ఉండేది. అయితే ఈ పెనాల్టీలు కొత్త అకౌంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి.
The Worst Decision of ICICI Bank 😡#ICICIBank raises average minimum balance for savings a/c in metros & urban areas to Rs 50,000
— Anuj Prajapati (@anujprajapati11) August 9, 2025
Earlier it was Rs 10,000
Why the hell people put their money in accounts. Urban youth wants to invest those money not to sit dead in Bank… pic.twitter.com/FXfdJ27tk8
క్యాష్ ట్రాన్సాక్షన్‌లకు కొత్త చార్జీలను కూడా మార్చారు. నెలకు 3 ఉచిత క్యాష్ డిపాజిట్లు చేసుకోవచ్చు. అదనపు ట్రాన్సాక్షన్‌కు రూ.150 వసూలుచేస్తారు. నెలవారీ ఉచిత డిపాజిట్ లిమిట్: రూ.1 లక్ష. దానిని మించితే రూ.3.5 పర్ రూ.1,000 లేదా రూ.150, ఏది ఎక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్-పార్టీ క్యాష్ డిపాజిట్లు చేస్తే ట్రాన్సాక్షన్‌కు రూ.25,000 లిమిట్ ఉంటుంది.
బ్రాంచ్‌లలో క్యాష్ విత్‌డ్రావల్స్ నెలకు 3 ఉచిత ట్రాన్సాక్షన్‌లు ఉంటాయి. అదనపు ట్రాన్సాక్షన్‌కు రూ.150 వసూలు చేస్తారు. ఆరు మెట్రో సిటీలు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇతర ATMల నుండి విత్‌డ్రావల్స్ నెలకు మొదటి 3 ట్రాన్సాక్షన్‌ల తర్వాత, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.23, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.8.5 చార్జ్ చేస్తారు. లిమిట్ ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లకు కలిపి వర్తిస్తుంది.
ఆగస్టు 2025 నుండి కొత్త అకౌంట్ తెరిచేవారు ఈ కొత్త MABను నిర్వహించాలి. లేకపోతే పెనాల్టీలు, చార్జీలు వర్తిస్తాయి. మెట్రో ఏరియాల్లో ఉండేవారు రూ.50,000 బ్యాలెన్స్ నిర్వహించాలి ఇప్పటికే ఉన్న కస్టమర్లరు ఈ మార్పులు వర్తించవు, పాత నిబంధనలు కొనసాగుతాయి.





















