అన్వేషించండి

Trump Tariffs Impact: ట్రంపరితనంతో భారత్‌పై భారీ షాక్! 50 శాతం టారిఫ్‌ మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి!

Trump Tariffs Impact:ట్రంప్ భారత్‌పై 50% టారిఫ్ విధించడంతో వస్త్రాలు, నగలు, రొయ్యల ఎగుమతులపై భారీ ప్రభావం పడనుంది. ఇది GDPపై ఏ స్థాయి ఎఫెక్ట్ చూపిస్తోందో చూద్దాం.

భారత్పై పగబట్టినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యాతో సంబంధాలు కలిగి ఉండమే తప్పు అన్నట్టు ట్రంప్తన తిక్కనంతా చూపిస్తున్నారు. 2025 ఆగస్టు 7న భారత్పై టారిఫ్ రేటు 50% విధిస్తున్నట్టు పేర్కొన్నారు.రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందుకు గతంలో విధించిన 25 శాతం టారిఫ్నకు అదనంగా మరో 25 శాతం విధించారు.

రష్యన్ ఆయిల్ విషయంలో అసంతృప్తి: భారతదేశం 2024-25లో రష్యా నుంచి 87.4 మిలియన్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంది, ఇది మొత్తం చమురు దిగుమతులలో 36% వాటా కలిగి ఉంది. యుద్ధానికి ముందు రష్యా వాటా కేవలం 2% లోపు మాత్రమే ఉండేది. 2024లో రష్యా చమురు దిగుమతుల విలువ 52.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ట్రంప్ ప్రభుత్వ వైఖరి: రష్యాతో భారత్ పెంచుకుంటున్న సంబంధాలు, కొనుగోలు చేస్తున్న ముడిచమురును "జాతీయ భద్రత" సమస్యగా ట్రంప్ పేర్కొంటున్నారు. రష్యా చమురు కొనుగోలు చేసి మాస్కో యుద్ధ యంత్రానికి ఆర్థిక సాయం చేస్తోందనే వాదన తెరపైకి తీసుకొచ్చారు. చైనా, టర్కీ వంటి ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఇటువంటి టారిఫ్లు విధించలేదు.

ప్రభావితమయ్యే రంగాలు

రష్యా- భారత్ సంబంధాలు తప్పుపడుతూ ట్రంప్వేసిన 50 శాతం టారిఫ్ వల్ల ప్రధానంగా చాలా రంగాలు ప్రభావితం అవుతాయి. అందులో కొన్నింటి గురించి ఇక్కడ చూద్దాం. 

వస్త్ర రంగం

ట్రంప్‌ టారిఫ్‌ల వల్ల వస్త్ర రంగం అత్యధిక దెబ్బతింటుంది. అమెరికాకు 2024-25లో 10.3 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలు భారత్ నుంచే ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు 50% టారిఫ్‌ వల్ల ఈ రంగం దారుణమైన పరిస్థితి ఎదుర్కొనే ఛాన్స్ ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CITI) అంచనా వేస్తోంది.

ప్రభావిత ఉత్పాదనలు:

  • కాటన్ టీ-షర్టులు (9.71% వాటా)
  • మహిళల దుస్తులు (6.52% వాటా)
  • పిల్లల దుస్తులు (5.46% వాటా)

గోకల్దాస్ ఎక్స్పోర్ట్, వెల్స్పన్ లివింగ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ఆదాయం 50 నుంచి 70 శాతం అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఆదాయంపై పెను ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జెమ్ అండ్ జ్యువెలరీ రంగం

ట్రంప్టారిఫ్తో రత్నాలు -నగల రంగం కూడా తీవ్ర ప్రభావానికి గురవుతుంది. 2024-25లో అమెరికాకు ఇండియా దాదాపు 10 బిలియన్‌ డాలర్ల జెమ్స్‌ అండే జ్యువెలరీలు ఎగుమతి చేసింది. 30 శాతం వాటా కలిగిన అమెరికా టారిఫ్లు పెంచడం కచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రొయ్యల ఎగుమతులు

రొయ్యల ఎగుమతులు అత్యధిక టారిఫ్ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే 5.77 శాతం కౌంటర్వైలింగ్ డ్యూటీ, 2.49 శాతం యాంటీ-డంపింగ్ పన్ను అమెరికా విధిస్తోంది. ఇప్పుడు వీటికి అదనంగా 50 శాతం టారిఫ్ అమలు అయితే మాత్రం పన్ను భారం 58.26 శాతానికి చేరుకుంటుంది. కేవలం 15 శాతం టారిఫ్తో ఉన్న ఈక్వడార్తో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది.

ఔషధ రంగం

ప్రస్తుతం మెడిసిన్పై టారిఫ్ప్రభావం లేదు. కానీ భవిష్యత్లో మాత్రం ఫార్మా రంగంపై కచ్చితంగా 250కుపైగా టారిఫ్ వేస్తామని మధ్యే ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలో ఔషధాల తయారీని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాల్లో పన్నులు పెంచుతామని చెబుతున్నారు. భారత్ నుంచి 2024-25లో $10.5 బిలియన్ల ఔషధాలు అమెరికా దిగుమతి చేసుకుంది. ఫార్మా ఎగుమతుల్లో 31% అన్నమాట. దీన్ని వీలైనంత తగ్గించాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు.

ఆటో కాంపోనెంట్స్

ఆటో కాంపోనెంట్స్ రంగం అమెరికా టారిఫ్స్తో ప్రభావితమవుతుంది. మిగతా రంగాలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. గతేడాది రంగం నుంచి అమెరికాకు $7 బిలియన్ల ఆటోపార్ట్స్ఎగుమతి అయ్యాయి. ఇప్పటికే రంగంపై 25 శాతం టారిఫ్ అమలులో ఉంది. ఇప్పుడు కొత్తగా ఎలాంటి టారిఫ్ విధించలేదు.

ఈ ట్రంప్ టారిఫ్‌లపై గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇనిషియేటివ్ లెక్కలు వేసింది. వీటి ఫలితంగా 40 నుంచి 50 శాతం వరకు ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఓ అంచనా ఉంది. దీని ప్రభావంతో  దాదాపు 45.4 బిలియన్‌ డాలర్లు ఎఫెక్ట్ అవుతాయి. ఇది భారత్ జీడీపీ ప్రభావం చూపుతుంది. 7% నుంచి 6%కి తగ్గించగలవని అంటున్నారు.

అమెరికాలో ధరలు పెరిగే వస్తువులు

  • భారత్దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు అమెరికాలో పెరగబోతున్నాయి.
  • వస్త్రాలు: భారతీయ టీ-షర్టులు, దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్50% వరకు ధర పెరుగుతాయి.
  • నగలు: వజ్రాలు- బంగారు నగలు
  • రొయ్యలు: భారతీయ రొయ్యలు 58శాతం మేర ధరలు పెరిగే అవకాశం ఉంది.

భారత్‌, బ్రెజిల్పై సమానంగానే ట్రంప్‌ 50 శాతం టారిఫ్వేశారు. చైనా, శ్రీలంకపై 30 శాతం, వియత్నాం, ఫిలిప్పీన్స్పై 20శాతం, బంగ్లాదేశ్పై 35 శాతం, మలేషియాపై 25 శాతం, థాయిలాండ్, కంబోడియాపై 36 శాతం టారిఫ్ వేశారు.

ట్రంప్ టారిఫ్భారత-అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఇదో కొత్త దశగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఇలాంటి సంక్షోభ సమయాన్ని భారతీయ ఎగుమతుదారులు ఆల్ట్రనేటివ్ప్రయత్నాలు చేయాలని వస్తువుకు మరింత వాల్యూ జోడించాలని సూచిస్తున్నారు. సాంకేతికంగా అప్గ్రేడ్ అవ్వాలని చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
Embed widget