అన్వేషించండి

Trump Tariffs:పాకిస్తాన్,బంగ్లాదేశ్, చైనా నుంచి భారత్‌ వరకు ట్రంప్ ఎవరిపై ఎంత టారిఫ్‌ వేశారు?

US Tariffs Country Wise List:డోనాల్డ్ ట్రంప్ భారత్ పై అధిక సుంకాలు విధించారు. చైనా కంటే ఎక్కువ. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కనికరం చూపుతున్నారు.

US Tariffs Country Wise List: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పట్ల కఠిన వైఖరి అవలభింస్తున్నారు. ట్రంప్ బుధవారం (ఆగస్టు 6) నాడు భారతదేశంపై 50 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్‌నారు. రష్యా-భారతదేశం వాణిజ్య సంబంధాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ భారతదేశంపై చైనా కంటే ఎక్కువ సుంకం విధించారు. అమెరికా చైనాతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కూడా దయ చూపిస్తోంది. అదే సమయంలో, భారతదేశం, బ్రెజిల్ సుంకం ఉచ్చులో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నాయి.

ట్రంప్ భారతదేశం-బ్రెజిల్ పై ఒకే రకమైన సుంకం విధించారు. ది హిందూ నివేదిక ప్రకారం, అమెరికా మొదట బ్రెజిల్‌పై 50 శాతం సుంకం విధించింది. భారతదేశంపై 25 శాతం మాత్రమే టారిఫ్ వేసింది. కాని ఇప్పుడు భారతదేశంపై టారిఫ్‌ను 25 శాతం పెంచారు. ఈ విధంగా, దానిపై మొత్తం 50 శాతం సుంకం విధించారు. భారత్‌- బ్రెజిల్ అత్యధిక సుంకం కలిగిన దేశాలుగా మారాయి. మూడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. దానిపై 39 శాతం విధించారు.కెనడాపై 35 శాతం సుంకం వేశారు.

దేశం పేరు  అమెరికా విధించిన టారిఫ్‌
భారత్‌ 50 శాతం 
బ్రెజిల్ 50 శాతం 
లావోస్‌ 40శాతం 
బర్మా 40శాతం 
స్విట్జర్లాండ్ 39శాతం 
ఇరాక్ 35శాతం 
కెనడా 35శాతం 
సెర్బియా 35శాతం 
చైనా 30 శాతం 
సౌతాఫ్రికా 30శాతం 
లిబియా 30శాతం 
బోస్నియా 30శాతం 
యూరోపియన్ యూనియన్ 15శాతం 
వియత్నం 20శాతం 
జపాన్ 15శాతం 
సౌత్ కొరియా  15శాతం 
యూకే, ఆస్ట్రేలియా, మెక్సికో 10శాతం 
మిగతా దేశాలు  10శాతం 

భారతదేశంతో పోలిస్తే చైనాపై ఎంత తక్కువ సుంకం విధించారు

అమెరికా చైనాపై 30 శాతం సుంకం విధించింది. భారతదేశంతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. ట్రంప్ ,జిన్ పింగ్ మధ్య సుంకంపై చాలా హాట్ హాట్‌ వార్ నడిచింది. చివరకు ఇది 30 శాతం వద్ద ఆగింది.

పాకిస్తాన్ -బంగ్లాదేశ్ పై దయ చూపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం

అమెరికా ,పాకిస్తాన్ మధ్య సంబంధాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. టారిఫ్‌ గురించి మాట్లాడితే, పాకిస్తాన్ చాలా మినహాయింపులు పొందింది. ట్రంప్ పాక్ పై 19 శాతం సుంకం విధించారు. అదే సమయంలో, బంగ్లాదేశ్ పై 20 శాతం సుంకం వేశారు.

అమెరికా- భారత‌ మధ్య ఉద్రిక్తత ఎందుకు పెరిగింది

వాస్తవానికి, భారతదేశం -రష్యా మంచి సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది రష్యా నుంచ పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తోంది. భారతదేశం రష్యా నుంచి చమురును ఎందుకు కొనుగోలు చేస్తుందనే దానితో ట్రంప్‌కు కడుపు మంట మొదలైంది. దీనిపై ట్రంప్ చాలాసార్లు బెదిరించారు. రష్యా తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని యుద్ధంలో ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.

అమెరికా తీసుకున్న ఈ చర్య వల్ల వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఎగుమతులు వంటి రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ ఉత్తర్వు ప్రకారం, మార్చి 8, 2022న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో కొన్ని దిగుమతులు, పెట్టుబడులపై ఆంక్షలు విధించారు. ఈ టారిఫ్‌ ఇతర అన్ని టారిఫ్‌, పన్నులకు అదనంగా ఉంటుందని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు.

ఉత్తర్వులో ట్రంప్ మాట్లాడుతూ, "భారత ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందని నేను భావిస్తున్నాను, కాబట్టి, వర్తించే చట్టం ప్రకారం, అమెరికా కస్టమ్స్ ప్రాంతంలోకి దిగుమతి చేసుకున్న భారతీయ వస్తువులపై 25 శాతం అదనపు సుంకం వేస్తాం. ఆగస్టు 27, 2025కి ముందు రవాణా చేసిన, సెప్టెంబర్ 17, 2025కి ముందు అమెరికాకు చేరుకునే వస్తువులకు సుంకం నుంచి మినహాయింపు ఉంటుంది." అని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget