HDFC Credit Card: జోరు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఒక్క నెల్లోనే 4లక్షల క్రెడిట్ కార్డుల జారీ! ఎందుకీ వేగం?
నిషేధం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జోరు పెంచింది. ఒక్క నెల్లోనే నాలుగు లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేసింది. పాత, కొత్త క్రెడిట్ కార్డు వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది.
క్రెడిట్ కార్డులు జారీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మళ్లీ జోరు అందుకుంది. గతనెల్లో నిషేధం ఎత్తేసిన తర్వాత నాలుగు లక్షలకు పైగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేసినట్టు తెలిసింది. 2021, సెప్టెంబర్ నాటికే రికార్డు స్థాయిలో వినియోగదారులకు కార్డులు అందజేసిట్టు బిజినెస్ స్టాండర్ట్ తెలిపింది. ఎంబార్గో (నిషేధం) ఎత్తేయడంతో ఒకప్పటికి స్థాయికి మళ్లీ చేరుకోవాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకొంది.
Also Read: చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!
ఎంబార్గో అమలు చేయకముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెలకు 3లక్షల రన్‌రేట్‌తో క్రెడిట్ కార్డులు జారీ చేసేది. రాబోయే రెండు నెలల కాలంలోనే ప్రి ఎంబార్గో రేట్‌కు చేరుకోవాలని సంస్థ పట్టుదలగా ఉంది. 2022, ఫిబ్రవరి నుంచి నెలకు 5లక్షల కార్డులు జారీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకొంది.
Also Read: ఆకర్షణీయమైన బెడ్‌షీట్లు.. అందమైన కర్టెన్లు.. అందుబాటు ధరల్లోనే!
'ఒకప్పుడు మేం కార్డు స్పేస్‌లో మార్కెట్ లీడర్లం. అందుకే మునుపటి జోరుతోనే పునరాగమనం చేయాలని భావించాం. ఇప్పుడు కొత్త వినియోగదారులను సంపాదించుకోవడమే కాకుండా పాత కార్డు దారులకూ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాం' అని హెచ్‌డీఎఫ్ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ, కన్జూమర్ ఫైనాన్స్, పేమెంట్స్ హెడ్ పరాగ్ రావ్ అన్నారు.
Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!
'వినియోగదారుల కొనుగోలు పద్ధతులు, ఏయే విభాగాల్లో ఖర్చు చేస్తున్నారు, వారి ఖర్చుల ప్యాట్రెన్ ఆధారంగా మా వ్యూహాలను మార్చుకుంటున్నాం. కొన్ని నెలలుగా మేం ఖర్చుల తీరును అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడదే మా వ్యూహాన్ని మార్చుకొనేందుకు, సరికొత్తగా సృష్టించుకొనేందుకు ఉపయోగపడింది. ఈ పండగ సీజన్లో మా వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని పరాగ్ తెలిపారు. ఫార్మా, ట్రావెల్, ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, టెలికాం, ఫిన్‌టెక్ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంతో కస్టమర్ అక్విజిషన్ 20 నుంచి 24కు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజా లెక్కల ప్రకారం మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 14.76 మిలియన్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయని తెలిసింది. ఆర్బీఐ నిషేధాజ్ఞలతో మార్కెట్లో వారి వాటా రెండు శాతం కన్నా ఎక్కువగా తగ్గిపోయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
This #WorldTourismDay travel to your dream destinations with the best offers and CashBack with HDFC Bank Credit Cards.
— HDFC Bank (@HDFC_Bank) September 27, 2021
To know more, visit: https://t.co/m0ch67KwpD #CreditCards #Offers #HDFCBankCards pic.twitter.com/EGj5oXd7y1