News
News
వీడియోలు ఆటలు
X

Google Shares Loss: ఒక్క తప్పు వల్ల ఒక్కరోజులో $100 బిలియన్లు నష్టపోయిన గూగుల్‌

షేర్ల పతనం తర్వాత ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ కేవలం ఒక్క రోజులో (బుధవారం) 100 బిలియన్‌ డాలర్లు తగ్గింది,.

FOLLOW US: 
Share:

Google Shares Loss: ఇంటర్నెట్ సెర్చ్ సంస్థ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌కు (Alfabeta Inc) అతి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ షేర్ల మార్కెట్ విలువ (Google Share Market Value) ఒక్క స్ట్రోక్‌లో 100 బిలియన్‌ డాలర్లు తగ్గింది. 

బుధవారం, ఆల్ఫాబెట్ ఇంక్‌ షేర్లు 8 శాతం లేదా 8.59 డాలర్లు పడిపోయి 99.05 డాలర్లకు దిగి వచ్చాయి.

బ్లూమ్‌బెర్గ్ ‍‌(Bloomberg) నివేదిక ప్రకారం.. షేర్ల పతనం తర్వాత ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ కేవలం ఒక్క రోజులో (బుధవారం) 100 బిలియన్‌ డాలర్లు తగ్గింది, ఇప్పుడు 1.278 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. అంతకు ముందు, 2022 అక్టోబర్ 26న ఆల్ఫాబెట్‌ (గూగుల్‌) షేర్లు 8.9 శాతం పడిపోయాయి. 

ఒక్క పొరపాటు వల్ల 100 బిలియన్ డాలర్లు నష్టం
రెండు నెలల క్రితం, 2022 నవంబర్‌ నెల చివరి వారంలో, గ్లోబల్‌ టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) తన కొత్త ప్రొడక్ట్‌ ఛాట్‌జీపీటీ (ChatGPT) చాట్‌బాట్‌ను పరిచయం చేసింది. టెక్‌ యుగంలో ఇదొక మైలురాయి. సెర్చ్‌ ఇంజిన్‌ కొత్త సాంకేతికతగా ప్రపంచం దీనిని పరిగణించింది. సెర్చ్‌ ఇంజిన్లలో రారాజుగా వెలుగొందుతున్న గూగుల్‌కు ఇది పోటీగా నిలిచింది. దీంతో, Google మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌, ChatGPTకి పోటీగా chatbot బార్డ్‌ను (Bard) పరిచయం చేసింది. దీని ప్రమోషన్‌లో భాగంగా, ట్విట్టర్‌లో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసింది. అందులో, బార్డ్ ఒక తప్పుడు సమాచారం ఇచ్చింది.

గూగుల్ పరిచయం చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీని (బార్డ్‌) 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తాజాగా ఏం కనిపెట్టింది, నా తొమ్మిదేళ్ల కుమారుడికి దాని గురించి ఏం చెప్పవచ్చు?' అని ప్రశ్న అడిగారు. ఈ ప్రాంప్ట్‌కు బార్డ్ చెప్పిన సమాధానం ఏంటంటే.. "మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఒక గ్రహానికి సంబంధించిన చిత్రాన్ని మొట్టమొదటిసారిగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసింది" అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం దెబ్బకు నెటిజన్ల మైండ్స్‌ బ్లాంక్‌ అయ్యాయి.
వాస్తవానికి, మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఒక గ్రహానికి సంబంధించిన చిత్రాన్ని మొట్టమొదటిసారిగా తీసింది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కాదు. యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్‌ టెలిస్కోప్‌ (VLT) 2004లో ఆ చిత్రాన్ని తీసింది, NASA కూడా దీనిని నిర్ధరించింది.

దీంతో, బార్డ్‌ అందించే సమాచారంపై అపనమ్మకాలు ఒక్కసారిగా విజృంభించాయి. ఆ ప్రభావం గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్ల మీద నెగెటివ్‌గా పడింది.

చాట్‌జిపీటీని మార్కెట్‌లోకి మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి గూగుల్ ఒత్తిడిలో ఉంది. సాంకేతిక పరిశ్రమలో దీనిని నెక్ట్స్‌ జెన్‌ టెక్నాలజీ, నెక్ట్స్‌ జెన్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా దీనికి బ్రహ్మరథం పట్టారు. కేవలం రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు యాడ్‌ అయ్యారు. మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీపై బిలియన్ల పెట్టుబడి పెడుతోంది. దీంతో, మార్కెట్‌ పోటీలో నిలబడడానికి గూగుల్‌ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. ఛాట్‌జీపీటీ కంటే మెరుగైన సెర్చ్‌ టూల్‌ అని చెబుతూ బార్డ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. బార్డ్‌లో లోపాలను తొలగించి త్వరలోనే లాంచ్ చేస్తామని గూగుల్ చెబుతోంది.

Published at : 09 Feb 2023 11:53 AM (IST) Tags: microsoft Alphabet ChatGPT Google AI Chatbot Bard

సంబంధిత కథనాలు

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్