అన్వేషించండి

RBI SALARIES: సెలవు రోజుల్లో కూడా జీతాలు, పింఛన్ డబ్బులు... ఆర్బీఐ శుభవార్త

శాలరీ పడ్డ రోజు బ్యాంకు సెలవు అన్న టెన్షన్ లేదు. పింఛన్ పడదన్న ఆందోళన అవసరం లేదు. అలాంటి వారందరికి గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ

ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సెలవు రోజుల్లో కూడా జీతం, పెన్షన్ డబ్బులు అకౌంట్‌లో పడనున్నాయి. ఇప్పటి వరకు వేతనం, పెన్షన్ డబ్బులు, ఈఎమ్ఐ చెల్లింపులు చేయడం అనేది బ్యాంక్ సెలవు రోజుల్లో వీలు కాకపోయేది. కానీ, కొత్తగా ఆర్‌బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనల్లో మార్పు చేయడంతో సెలవు రోజుల్లో కూడా జీతం, పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి. ఈ  కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ కావడమో కట్ కావడం జరుగుతుంది. 
ఇప్పుడు బ్యాంక్ పనిదినాల కోసం జీతం లేదా పెన్షన్ డబ్బుల కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎన్ఏసీహెచ్ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు ఎన్ఏసీహెచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు నెల మొదటి రోజు వారాంతంలో వస్తుంది. దీని కారణంగా ప్రజలు బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండాలి. జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారుల అందించే సేవలను మరింత పెంచడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 

ఎన్‌ఏసీహెచ్‌ అనేది బల్క్‌ పేమెంట్ సిస్టమ్. దీన్ని ఎన్‌పీసీఐ ఆపరేట్ చేస్తోంది. ఇది ఒకరి నుంచి ఎక్కువ మందికి డబ్బులు ట్రాన్స్‌ఫర్స్ చేసేందుకు వీలుపడుతుంది. డివిడెండ్స్‌, వడ్డీలు, జీతాలు, పింఛన్లు ఇలాంటి వాటి కోసం దీన్ని వినియోగిస్తారు. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, టెలిఫోన్, వాటర్, ఈఎంఐలు చెల్లింపు, ఫండ్స్‌ ఇన్వెస్ట్ చేసేందుకు కూడా ఉపయోగిస్తారు. 

ALSO READ: కోవిబెసిటీతో జాగ్రత్త.. ముప్పు ఎక్కువే
ఎన్‌ఏసీహెచ్‌ ఆదేశాలు ఇచ్చిన తర్వాత పేవ్‌మెంట్స్‌ కోసం ప్రతి నెల చెక్స్‌ ఇవ్వాల్సిన పని లేదు. అకౌంట్‌లో సరిపడా నగదు ఉంచుకుంటే సరిపోతుంది. ప్రతి నెల మనం చెప్పిన తేదీకి చెప్పిన అమౌంట్‌ ఆటోమేటిక్‌గా కట్‌ అయిపోతుంది. ఇది పర్సనల్ అకౌంట్స్‌ నుంచి కార్పొరేట్ అకౌంట్స్ వరకు అందరికీ వర్తిస్తుంది. 

ఎన్‌ఏసీహెచ్‌ చాలా ప్రాముఖ్యత ఉన్న డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్సఫర్‌ ప్లాట్‌ఫాం. భారీ సంఖ్యలో లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ వేదిక చాలా యూజ్‌ఫుల అంటోంది ఆర్బీఐ. కరోనా టైంలో లబ్ధిదారులకు సబ్సిడీలు సకాలంలో పారదర్శకంగా అందించేందుకు మంచి వేదికని కితాబిచ్చింది. 

ALSO READ: దూసుకుపోయిన జొమాటో.. తొలిరోజే అదిరే ఆరంభం

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Embed widget