Gold Silver Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర.. భారీగా పుంజుకున్న వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారత మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరగగా.. వెండి ధర మాత్రం భారీగా పుంజుకుంది. భారత మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం నాడు (ఆగస్టు 25న) స్వల్పంగా పెరిగాయి.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం నాడు (ఆగస్టు 25న) స్వల్పంగా పెరిగాయి. నేడు బంగారం ధరలో గ్రాముకు రూ.21 మేర పెరగడంతో ఒక తులం (10 గ్రాములపై) రూ.210 మేర పెరిగింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,600 కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.50,830 అయింది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే రూ.500 మేర బంగారం ధర పెరిగింది.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరగగా.. వెండి ధర మాత్రం భారీగా పుంజుకుంది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,800 అయింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇదే ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. నేడు కిలో వెండి ధర రూ.67,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 25న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: Tata Punch: పండుగ స్పెషల్‌గా ఎంట్రీ ఇవ్వనున్న టాటా మినీ ఎస్‌యూవీ పంచ్..
తెలంగాణ, ఏపీల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.22 చొప్పున పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,490 అయింది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,450 కి చేరింది. ఇక స్వచ్ఛమైన వెండిపై రూ.1000 మేర భారీగా పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ వెండి ఇదే ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.
నేడు విజయవాడలో 22 క్యారెట్ల బంగారంపై రూ.220 మేర పెరగడంతో ధర ఆగస్టు 25న రూ.44,450 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,490కు చేరుకుంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,700 అయింది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,490కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,450 అయింది.
Also Read: ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో లోపాలు.. ఇన్ఫోసిస్ ఎండీకి కేంద్రం నోటీసులు
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 24న ఇలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850 కి పెరగగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,930గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 అయింది.
ప్లాటినం ధర..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే ప్లాటినం ధర తాజాగా తగ్గింది. గ్రాము తాజా ధర రూ.2,413 కి దిగొచ్చింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,130 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల వారికి అలర్ట్