![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tata Punch: పండుగ స్పెషల్‌గా ఎంట్రీ ఇవ్వనున్న టాటా మినీ ఎస్‌యూవీ పంచ్..
దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటార్స్.. మినీ ఎస్‌యూవీ పంచ్ విడుదల తేదీపై ప్రకటన చేసింది. ఈ కారును రాబోయే పండుగల సీజన్‌లో లాంచ్ చేస్తామని పేర్కొంది. దీపావళి సందర్భంగా పంచ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
![Tata Punch: పండుగ స్పెషల్‌గా ఎంట్రీ ఇవ్వనున్న టాటా మినీ ఎస్‌యూవీ పంచ్.. Tata HBX micro SUV officially unveiled as Tata Punch, takes aim at key segment Tata Punch: పండుగ స్పెషల్‌గా ఎంట్రీ ఇవ్వనున్న టాటా మినీ ఎస్‌యూవీ పంచ్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/31371206b36234fad319b743f5943bf6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటార్స్.. మినీ ఎస్‌యూవీ పంచ్ విడుదల తేదీపై ప్రకటన చేసింది. గతేడాది ఆటో ఎక్పోలో కంపెనీ ఈ మినీ ఎస్‌యూవీని ప్రదర్శించింది. అప్పటినుంచి ఈ కారు స్పెసిఫికేషన్లు, పేర్లపై ఊహాగాలు వెలువడ్డాయి. దీనికి హెచ్‌బీఎక్స్ లేదా హార్న్‌బిల్ అనే పేరు పెడతారనే లీకులు వచ్చాయి. వీటన్నింటికీ తెరదించుతూ టాటా అధికారిక ప్రకటన వెలువరించింది. దీనికి పంచ్ అనే పేరు పెట్టనున్నట్లు తెలిపింది.
H2X, HBX, Hornbill - Yes, we know you have been guessing, but we have a surprise for you! 😉
— Tata Motors Cars (@TataMotors_Cars) August 23, 2021
Introducing The All-New TATA PUNCH!
Built on the ALFA-ARC platform, It’s truly an SUV meant for all!
Know more - https://t.co/LO9lXakPkN#TATAPUNCH #TataMotors pic.twitter.com/i7MwWhnnvY
హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా పంచ్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. స్పోర్టింగ్ డైనమిక్స్‌తో పంచ్‌ను రూపొందించినట్లు వెల్లడించింది. ఈ పంచ్ కారును రాబోయే పండుగల సీజన్‌లో లాంచ్ చేస్తామని పేర్కొంది. దీపావళి సందర్భంగా ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది. టాటా నుంచి వచ్చిన కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ కంటే ఇది తక్కువ పరిమాణంలో ఉండనుంది.
టాటా మినీ పంచ్ స్పెసిఫికేషన్లు..
టాటా నుంచి వచ్చిన ఎస్‌యూవీలలో మొట్టమొదటి సారిగా పంచ్ కార్లలో ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ని (ALFA-ARC) ఉపయోగించారు. ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ద్వారా దీనిని రూపొందించారు. హైవేలపై దూసుకుపోయేలా దీనిని డిజైన్ చేశారు.
ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. టియాగో, టిగోర్ మరియు ఆల్ట్రోజ్ కార్లలో కనిపించే 1.2 లీటర్ల ఇంజిన్ ఇందులో కూడా ఉండవచ్చు. గేర్ బాక్స్ చాయిస్ లలో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆటోమెటిక్ ఉండే అవకాశం ఉంది. హై వేరియంట్లలో డ్రైవింగ్ మోడ్స్ అందించవచ్చని తెలుస్తోంది.
One day to go for the grand unveil!
— Tata Motors Cars (@TataMotors_Cars) August 22, 2021
The true identity of the much anticipated HBX unravels tomorrow. 😉#TataMotors #HBX #ComingSoon pic.twitter.com/cumYoOUw9O
టాటా మోడల్ కార్లలో అందించే 7 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇందులో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎస్‌యూవీ ప్రమాణాలతో, పట్టణాలు, నగరాల్లో ప్రయాణించేందుకు అనువైన చిన్న వాహనంగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. స్పోర్టీ త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆల్ట్రోజ్ నుండి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ వంటి ఫీచర్లతో రానుంది.
Also Read: Tata Tigor EV: టాటా నుంచి సూపర్ ఫీచర్స్‌తో మరో ఎలక్ట్రిక్ కారు.. అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..
Also Read: Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియోలో న్యూ వేరియంట్.. కొత్త పీచర్ ఏంటంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)