Gold Silver Price Today 22 october 2021: భారత్ మార్కెట్లో తగ్గినా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర, పరుగులు పెడుతున్న వెండి ధరలు, మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎంతున్నాయంటే...
తెలుగు రాష్ట్రాల్లో పుత్తడి, వెండి ధరలకు రెండు రోజులుగా రెక్కలొచ్చాయి. తులం బంగారం ధర రూ.100, కేజీ వెండి ధర దాదాపు రూ.1500 పెరిగింది. ఉదయం 6 గంటల వరకూ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలివే.
భారత్ మార్కెట్లో బంగారం తులం బంగారం ధర రూ.20 తగ్గగా హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 100 పెరిగింది. అంటు వెండి ధర కూడా భారత్ మార్కెట్లో రూ. 900 పెరిగితే హైదరాబాద్ మార్కెట్లో రూ.1500 పెరిగింది. ఇక భారత్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47, 470 ఉంది. ఇక కేజీ వెండి ధర నిన్న( (గురువారం) రూ. 64,600 ఉండగా ఈ రోజు (శుక్రవారం) రూ.65,500 ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
Also Read: ఈ ఐదు రాశులవారు ఈ రోజు ఏం చేసినా కలిసొస్తుంది .. మీ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే...
ప్రధాన నగరాల్లో వెండిధరలు
భారత్ మార్కెట్లో వెండి ధరలు రూ.900 పెరిగ్గా...తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.1500 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో కేజీ వెండి ధర నిన్న రూ.70,200 ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా , బెంగళూరు, లక్నోలో కేజీ వెండి ధర రూ. 65,500 కాగా...చెన్నై ,కేరళలో కేజీ వెండి రూ. 70,200 ఉంది.
Also Read: రెడ్‌మీ కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయ్.. సూపర్ ఫీచర్లు.. బడ్జెట్ రేట్!
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు : పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలనుకుంటున్నారా... త్వరపడండి.. రేటు పెరుగుతోంది.. ఎంత కానుందంటే?
Also Read: దీన్నే వాడుకోవడమంటారు.. సిరిని తిడుతూ ఏడ్చేసిన షణ్ముఖ్..
Also Read: అన్ని నగరాల్లో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎంతంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి