News
News
X

Gold-Silver Price 22 December 2022: ఒక్కసారిగా షాక్‌ ఇచ్చిన బంగారం, ₹75 వేలకు దగ్గరలో వెండి

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,700 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

FOLLOW US: 
Share:

Gold-Silver Price 22 December 2022: ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 500, స్వచ్ఛమైన పసిడి ₹ 540 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా ₹ 800 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 50,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,650 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,700 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 50,100 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,650 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,700 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 51,180 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,830 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 50,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,650 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,820 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,700 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,700 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,650 గా ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 600 పెరిగి ₹ 26,630 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 22 Dec 2022 06:51 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్‌లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!

Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్‌లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!

FII stake: మూడు నెలల్లోనే ఎఫ్‌ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?

FII stake: మూడు నెలల్లోనే ఎఫ్‌ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?

Telangana Budget 2023: రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టులు - 1,721 పోస్టుల‌ మంజూరు!

Telangana Budget 2023: రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టులు - 1,721 పోస్టుల‌ మంజూరు!

Stock Market News: మార్కెట్లు డల్‌ - కేక పెట్టించిన అదానీ షేర్లు, సెన్సెక్స్‌ 335 డౌన్‌!

Stock Market News: మార్కెట్లు డల్‌ - కేక పెట్టించిన అదానీ షేర్లు, సెన్సెక్స్‌ 335 డౌన్‌!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!

Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!