Gold-Silver Price: ఇవాళే ధనత్రయోదశి.. బంగారం ధరలో కాస్త ఊరట.. తగ్గిన వెండి, నేటి ధరలివీ..
విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,770గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు, వెండి కిలోకు రూ.200 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,770 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,700గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర రూ.200 పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,770గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,700గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,770గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,700 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,110గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా ఉంది.
Also Read: ధన త్రయోదశికి బంగారం కొంటున్నారా..! అమెజాన్లో 20% డిస్కౌంట్ 10% క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.2 తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,510 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Maruti Celerio 2021: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!