అన్వేషించండి

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్, వరుసగా నాలుగో రోజు పెరిగిన బంగారం ధర, స్వల్పంగా పుంజుకున్న వెండి

Gold Rate Today 12th February 2022: బంగారం ధర రూ.250 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,970 అయింది.

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నాలుగో రోజు బంగారం ధర పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.250 మేర పుంజుకోగా తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,800 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర (Gold Rates Today In Hyderabad) ప్రస్తుతం రూ.49,970 అయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర పెరిగింది. ఫిబ్రవరి నెలలో గరిష్టానికి ఎగబాకింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,900 కు చేరింది.

ఏపీ మార్కెట్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rates Today In Vijayawada)పై రూ.280 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,970 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,800కి ఎగబాకింది. వెండి 1 కేజీ ధర రూ.66,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 అయింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,970 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,800 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,810 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,980 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.30 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,040 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,230కు చేరింది.

ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.24,780కి దిగొచ్చింది. ఢిల్లీలో ప్లాటినం ధర రూ.8 మేర పెరగడంతో తులం ధర రూ.24,860 అయింది. హైదరాబాద్‌లో, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో రూ.7 మేర తగ్గడంతో. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,710 కి క్షీణించింది.

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: Minister Perni Nani: మోహన్ బాబు ఆహ్వానం మేరకే భేటీ, ఎవరికీ సంజాయిషీ ఇచ్చేందుకు కాదు : మంత్రి పేర్ని నాని 

Also Read: LIC Stock Holdings: స్టాక్‌ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.10 లక్షల కోట్లు- ఒక్క రిలయన్స్‌లోనే రూ.లక్ష కోట్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget