(Source: ECI/ABP News/ABP Majha)
LIC Stock Holdings: స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.10 లక్షల కోట్లు- ఒక్క రిలయన్స్‌లోనే రూ.లక్ష కోట్లు
LIC Stock Holdings: ఈక్విటీ మార్కెట్లలో LIC పెట్టుబడుల మొత్తం దాదాపుగా రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. విలువ ప్రకారం చూస్తే ఇది రూ.9.53 లక్షల కోట్లుగా ఉందని ప్రైమ్ డేటాబేస్ అంచనా వేసింది.
LIC Stock Holdings: భారత ఈక్విటీ మార్కెట్లలో భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) పెట్టుబడుల మొత్తం దాదాపుగా రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. 2021, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇది 3.67 శాతంగా ఉందని. ఒకప్పటితో పోల్చుకుంటే ఎల్‌ఐసీకి ఇవే అతి తక్కువ పెట్టుబడి మొత్తం కావడం గమనార్హం. అయినప్పటికీ విలువ ప్రకారం చూస్తే ఇది రూ.9.53 లక్షల కోట్లుగా ఉందని ప్రైమ్ డేటాబేస్ తెలిపింది.
ఐడీబీఐలో ఎక్కువ వాట I IDBI Bank
ఎన్‌ఎస్‌ఈ నమోదిత 278 కంపెనీల్లో ఎల్‌ఐసీకి ఒక శాతం కన్నా ఎక్కువ వాటా ఉంది. మిగతా బీమా కంపెనీలతో పోలిస్తే ఈ ఒక్క దానికే 77 శాతం ఈక్విటీల్లో పెట్టుబడులు ఉన్నాయి. పర్సెంటేజీ ప్రకారం చూస్తే ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. తన సబ్సిడరీ కంపెనీ ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 45.24 శాతం వాటా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీసీ (16.21%), హిందుస్థాన్ కాపర్ (14.22%), ఎన్‌ఎండీసీ (14.16%), ఎంటీఎన్‌ఎల్ (13.12%), లార్సెన్ అండ్ టర్బో (12 %), ఆయిల్ ఇండియా (11.85%), హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ (11.65%), క్యాస్ట్రాల్ ఇండియా (11.34%)లో అత్యధిక పెట్టుబడులు ఉన్నాయి.
రిలయన్స్‌లో రూ.లక్ష కోట్లు । Reliance Indusrties
విలువ ప్రకారం చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఎల్‌ఐసీకి గణనీయమైన వాటా ఉంది. ఆ కంపెనీలో రూ.95,274 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. టీసీఎస్‌లో రూ.50,465 కోట్లు, ఇన్ఫోసిస్‌లో రూ.45,023 కోట్లు, ఐటీసీలో రూ.43,023 కోట్లు, ఎస్‌బీఐలో రూ.33,855 కోట్లు, ఎల్ అండ్ టీలో రూ.31,948 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకులో రూ.31,948 కోట్లు, హిందుస్థాన్ యునీలివర్‌లో రూ.31,948 కోట్లు, ఐడీబీఐ బ్యాంకులో రూ.24, 565 కోట్లు, ఓఎన్‌జీసీలో రూ.18,704 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.
ఇందులో పెంచుకొంది
ఇక పవర్‌గ్రిడ్, డ్రెడ్జింగ్ ఇండియా, కంప్యూటర్ సర్వీసెస్, కోఫోర్జ్, దీపక్ నైట్రేట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లో ఎల్‌ఐసీ వాటాను పెంచుకుంది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, ఏబీబీ ఇండియా, హిందుస్థాన్ మోటార్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్, హెచ్‌ఏఎల్, బాంబే డైయింగ్‌లో వాటాను తగ్గించుకుంది. ఎన్‌ఎస్‌ఈ నమోదిక 85 కంపెనీల్లో ఎల్‌ఐసీ చివరి క్వార్టర్లో ఎంతో కొంత వాటా పెంచుకుంది. స్టాక్ మార్కెట్లో ఇన్ని కంపెనీల్లో గణనీయమైన వాటా ఉన్న ఎల్‌ఐసీ ఈ ఆర్థిక ఏడాదిలో రూ.లక్ష కోట్ల విలువ మేర ఐపీవోకు రానుంది.
Also Read: ఉద్యోగం మారితే పాత సాలరీ అకౌంట్‌కు ఫైన్ వేస్తారా? నిబంధనలు మారతాయా?
Also Read: ఐటీ శాఖ అప్‌డేట్ - ఏడాదికి ఒకసారి అప్‌డేటెడ్ ITR దాఖలుకు అవకాశం